ట్రిపుల్ రైడింగ్‌! లారీ ఢీ కొని కింద ప‌డ్డ యువ‌తిపై!

పట్టణంలోని కలెక్టరేట్‌ సమీపంలో బుధవారం రాత్రి లారీ ఢీకొట్టిన సంఘటనలో యువతి మృతి చెందింది. మృతురాలిని చీపురుప‌ల్లికి చెందిన విజ‌య సుజిత‌గా గుర్తించారు. సుజిత తన తల్లిదండ్రులు రాఘవరావు, ఈశ్వరీలతో కలిసి విజ‌య‌న‌గ‌రం కలెక్టరేట్‌ సమీపంలోని పైడిమాంబ కాలనీ మేనత్త ఇంటికి వచ్చారు.

 

అక్క‌డి నుంచి రాత్రి 8 గంటల సమయంలో బైక్‌పై తల్లిదండ్రులతో కలిసి సుజిత వెళ్తుండగా.. క‌లెక్ట‌రేట్ స‌మీపంలో విశాఖపట్నం వైపున‌కు వెళ్తోన్న లారీ వెనుక నుంచి బైక్‌ని ఢీకొట్టింది. దీంతో సుజితకు బలమైన గాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఆమె మృతి చెందింది.

రాఘవరావు, ఈశ్వరీలకు స్వల్ప గాయాలయ్యాయి. సంఘటన తెలుసుకున్న ట్రాఫిక్‌ ఎస్‌ఐ వాసుదేవరావు సంఘటనా స్థలానికి వెళ్లి జరిగిన తీరు పరిశీలించి మృతురాలిని కేంద్రాసుపత్రికి తరలించారు. తల్లిదండ్రులను ఆసుపత్రిలో చేర్చి, చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వాసుదేవరావు తెలిపారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here