సెల్ఫీ విత్ గ‌న్‌..త‌ల్లో దిగిన బుల్లెట్‌!

న్యూఢిల్లీ: సెల్ఫీ మ‌ర‌ణాల్లో ఇదో కొత్త కోణం. సెల్ఫీ కోసం తుపాకీతో బుంగ‌మూతి పెట్టి ఫొటోకు ఫోజిచ్చిన వైనం ఓ నిండు ప్రాణాన్ని బ‌లి తీసుకుంది. దేశ రాజ‌ధానిలోని సరిత విహార్‌లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఉత్తర ప్రదేశ్‌లోని పాలి గ్రామానికి చెందిన ప్రశాంత్ చౌహాన్ ఉపాధ్యాయుడు.

మార్చి 8న ఢిల్లీలోని సరిత విహార్‌లో నివసిస్తున్న తన మేనమామ ఇంటికి వెళ్లారు. అదే స‌మ‌యంలో ఇంటర్మీడియట్ చదువుతున్న ఆయ‌న మేన‌ల్లుడు సెల్ఫీ దిగాల‌ని ముచ్చ‌ట‌ప‌డ్డాడు. తన తండ్రి వ‌ద్ద ఉన్న లైసెన్స్డ్ రివాల్వర్‌ను ప‌ట్టుకెళ్లి త‌న మేన‌మామ ప్ర‌శాంత్ చౌహాన్ పక్కనే నిలబడి సెల్ఫీకి ఫోజిచ్చాడు.

ఫొటో తీసుకుంటున్న స‌మ‌యంలో అది పేలింది. పక్కనే ఉన్న ప్రశాంత్ త‌ల‌లోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఆయనను ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయారని ఢిల్లీ డీసీపీ చిన్మయి బిస్వాల్ చెప్పారు. ఆ టీనేజ‌ర్ విద్యార్థిపై కేసు న‌మోదు చేసిన‌ట్లు చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here