ర‌జినీకాంత్ కంటే స్టైల్‌గా కింగ్ సైజ్ సిగ‌రెట్‌తో ద‌మ్ము బిగించి కొడుతున్న బుడ్డోడు!

చేతిలో సిగ‌రెట్‌..ఎదురుగా యాష్‌ట్రే. ర‌జినీకాంత్ కంటే స్టైల్‌గా ద‌మ్ము మీదు ద‌మ్ము బిగించి కొడుతున్నాడో బుడ్డోడు. అత‌ని వ‌య‌స్సు రెండున్న‌రేళ్లే.

ర‌ష్యాలోని వ్లాదికావ్‌కాజ్‌లో తీసిన‌ట్టుగా భావిస్తోన్న ఈ వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. కుడి చేతి వెళ్ల మ‌ధ్య సిగ‌రెట్‌ను ప‌ట్టుకోవ‌డానిక్కూడా స‌రిగ్గా రాని ఆ బుడ్డోడు.. గుప్పు గుప్పుమంటూ స్మోక్ చేస్తుండ‌టాన్ని చూసిన నెటిజ‌న్లు ఠారెత్తిపోతున్నారు.

ఈ వీడియో ఆధారంగా ఆ చిన్నారి త‌ల్లిదండ్రుల అడ్ర‌స్‌ను వెదికి ప‌ట్టుకుని మ‌రీ.. వారిని శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆ బాబు పేరు, ఇత‌ర వివరాలేవీ తెలియ‌రావ‌ట్లేదు. త‌ల్లిదండ్రుల‌ను ప్రాసిక్యూట్ చేయాలంటూ ఒక‌రిద్ద‌రు న్యాయ‌వాదులు కేసు కూడా పెట్టార‌ట‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here