క‌ట్టుకున్న భార్యను ఆమె ప్రియుడికి ఇచ్చి.. మేళ‌తాళాల‌తో పెళ్లి చేసిన భ‌ర్త‌!

క‌ట్టుకున్న భార్య పెళ్లికి ముందే ప్రేమ వ్య‌వ‌హారాన్ని న‌డిపిందంటే అగ్గి మీద గుగ్గిలం అవుతారు ఎవ‌రైనా. ఈ భ‌ర్త మాత్రం దీనికి భిన్నం. ఆమె మ‌న‌సు తెలుసుకుని ప్ర‌వ‌ర్తించాడు. క‌ట్టుకున్న భార్య‌ను ఆమె కోరుకున్న ప్రియుడికి ఇచ్చి ఘ‌నంగా పెళ్లి చేశాడు. ఊరేగింపు కూడా నిర్వ‌హించాడు. ఇష్ట‌ప‌డిన యువ‌కుడితో ఆమె వెళ్లిపోతోంటే పొర్లి పొర్లి ఏడ్చాడు.

ఈ విచిత్ర సంఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని కాన్పూర్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని చ‌కేరీ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలో ఉన్న సానిగావ్ గ్రామానికి చెందిన స‌చిన్ ఆలియాస్ గోలూ గుప్తా ఓ ప్రైవేటు సంస్థ‌లో ఉద్యోగి. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 19వ తేదీన అత‌ని వివాహం ఫ‌తేపూర్ స‌మీపంలోని మాంఝిల్ గ్రామానికి చెందిన శాంతితో జ‌రిగింది.

 

పెళ్లి త‌రువాత అత్తింటికొచ్చిన ఆమె ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న‌ట్టు ఉండేది. భార్య త‌న‌ను ఇష్ట‌ప‌డ‌ట్లేద‌నే విష‌యాన్ని గోలూ గుప్తా తెలుసుకున్నాడు. ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో శాంతి ఎవ‌రితోనూ చాలాసేపు ఫోన్‌లో మాట్లాడే విష‌యాన్ని అత‌ను గుర్తించాడు. ఆమెను రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నాడు.

అప్పుడే అత‌నికి శాంతి ప్రేమ వ్య‌వ‌హారం తెలిసింది. తాను ర‌వి సింగ్ అనే యువ‌కుడిని మూడేళ్లుగా ప్రేమిస్తున్నాన‌ని స్ప‌ష్టం చేసింది. ర‌విసింగ్‌తో శారీర‌క సంబంధం కూడా ఉంద‌ని అంగీక‌రించింది. దీనితో- గోలూ గుప్తా స్వ‌యంగా ర‌విసింగ్‌తో మాట్లాడాడు. అత‌ణ్ని క‌లిసి పెళ్లికి ఒప్పించాడు. త‌న భార్య‌ను అత‌నికి ఇచ్చి వైభ‌వంగా పెళ్లి చేశాడు. ఆమెను సాగ‌నంపాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here