భారీ స్కెచ్‌! `నువ్వు నాతో ఉన్న ఫొటోలు, వీడియోలు నీ భార్య‌కు పంపిస్తా..`!

`చెప్పిన‌ట్టు విన‌క‌పోతే, నువ్వు నాతో ఉన్న ఫొటోలు, వీడియోలు నీ భార్య‌కు పంపిస్తా..`అంటూ ఓ యువ‌తి త‌న మాజీ ప్రియుడిని బ్లాక్‌మెయిల్ చేసింది. అంత‌టితో ఆగ‌లేదు. తాను చెప్పిన చోటికి ర‌మ్మ‌ని పిలిపించి, మ‌రీ దారుణంగా హ‌తమార్చింది. గ్రేట‌ర్ నోయిడా స‌మీపంలోని ల్యాడోపుర గ్రామంలో చోటు చేసుకుంది.

త‌న మాజీ ప్రియుడిని బ్లాక్ మెయిల్ చేస్తూ వ‌చ్చిన ఆమె.. చివ‌రికి అత‌ను డ‌బ్బులు ఇవ్వ‌లేని స్థితికి చేరుకోవ‌డంతో కక్ష పెంచుకుని హత్య చేసిన‌ట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితురాలి పేరు సోన‌మ్ ఆలియాస్ సోను. హ‌తుడి పేరు జితేంద్ర‌. జితేంద్ర వివాహితుడు. పెళ్ల‌యిన త‌రువాత అత‌నికి సోనమ్‌తో పరిచయం ఏర్పడింది. వారి మ‌ధ్య వివాహేత‌ర సంబంధం ఏర్ప‌డింది. కొద్దిరోజుల నుంచి వారు దూరంగా ఉంటున్నారు.

సోన‌మ్ మ‌న‌స్త‌త్వం తెలిసి ఆమెతో దూరంగా ఉండ‌సాగాడు. దీనితో అత‌ణ్ని బెదిరించడం మొద‌లు పెట్టిందామె. తనకు డబ్బు ఇవ్వాలని లేనిపక్షంలో మన వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు నీ భార్యకు పంపిస్తానంటూ జితేంద్రను సోనమ్‌ బెదిరించేది. దీనికి భ‌య‌ప‌డ్డ జితేంద్ర మొద‌ట్లో ఆమెకు పెద్ద ఎత్తున డ‌బ్బులు ఇచ్చాడు.

క్ర‌మంగా ఆమె ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను డిమాండ్ చేయ‌డం మొద‌లు పెట్టింది. డబ్బులిచ్చే ప్రసక్తే లేదని జితేంద్ర చెప్పడంతో ప్రియుడి హత్యకు ప్లాన్‌ చేసింది. పథకం ప్రకారం ఫోన్‌ చేసి బిలాస్‌పూర్‌ ఏరియాకు రావాలని జితేంద్రను కోరింది. జితేంద్ర అక్కడకు రాగానే అతనిపై దాడి చేసింది. చెక్క‌ముక్క‌ల‌తో తీవ్రంగా కొట్టింది. జితేంద్ర చనిపోయాడని నిర్ధారించుకున్న అనంతరం తన స్కూటర్‌పై సోనియా వెళ్లిపోయింది.

జితేంద్రను ఎవరో హత్య చేశారని అతడి తమ్ముడు హతీమ్‌ సింగ్ స్థానిక పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశాడు. సోనియాపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆమెపై కేసు నమోదు చేసిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా.. త‌న నేరాన్ని అంగీక‌రించింది. హత్యకు ఉపయోగించిన చెక్కముక్క‌ల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here