ఆనం వివేకానందరెడ్డి ఇక లేరు..!

నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆనం వివేకానందరెడ్డి కన్నుమూశారు. సికింద్రాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. కొన్ని వారాలుగా కిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు ఉదయం కన్నుమూశారు. గత ఎన్నికల తర్వాత తన సోదరుడు, మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డితో కలసి ఆయన టీడీపీలో చేరారు. ఇటీవలే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కిమ్స్ ఆసుపత్రికి వచ్చి, ఆనంను పరామర్శించారు. మరోవైపు వివేక మృతితో టీడీపీ, కాంగ్రెస్ నేతలు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. గత కొంత కాలంగా ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో, కుటుంబసభ్యులు ఆయనను కిమ్స్ ఆసుపత్రిలో చేర్చారు.

1950 డిసెంబర్ 25న నెల్లూరులో వివేకా జన్మించారు. నెల్లూరు వీఆర్ కాలేజీలో బీఏ పూర్తి చేశారు. ఆయనకు ఇద్దరు కుమారులు. ఆనం వివేకా మొత్తం మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన అనుచరులు ఆయనను టైగర్ అని ముద్దుగా పిలిపించుకుంటారు.ఆనం వేసే సెటైర్లు అందరికీ కడుపుబ్బ నవ్వును తెప్పించేవి. ఆనంకు మటన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు మధ్యాహ్నం ఆయనకు బిర్యానీ ఉండాల్సిందేనట. ఇన్నాళ్ళూ అందరితో నవ్వుతూ కనిపించిన ఆనం ఇక లేరని ఆయన సన్నిహితులు బాధపడుతూ ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here