క్రికెట్ ప్రపంచానికే షాకింగ్.. రిటైర్మెంట్ ప్రకటించిన ఏబీ డివిలియర్స్..!

క్రికెట్ ప్రపంచానికే షాక్ కు గురిచేసేలా ఏబీ డివిలియర్స్ ఓ నిర్ణయం తీసుకున్నాడు. ఎంతో అద్భుతంగా ఆడుతున్న డివిలియర్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించారు. 34 ఏళ్ల ఈ సౌత్ ఆఫ్రికన్ క్రికెటర్ తాను రిటైర్మెంట్ తీసుకుంటున్నానని ప్రకటించేశాడు. ఇదే సరైన సమయమని.. తన 14 ఏళ్ల కెరీర్ ను ముగించేస్తున్నానని చెప్పాడు.

బుధవారం నాడు ఏబీడీ మాట్లాడుతూ ‘ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి తాను తక్షణమే వైదొలగాలని భావిస్తున్నానని’ చెప్పాడు. ‘114 టెస్ట్ మ్యాచ్ లు, 228 వన్డేలు.. 78 టీ20 మ్యాచ్ లు దేశానికి ఆడానని.. తాను అలసిపోయానని.. ఇక వేరే వాళ్ళకు తన స్థానంలో ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నానని’ ఏబీడీ చెప్పుకొచ్చాడు. ‘ఇదే నా జీవితంలో చాలా కఠినమైన నిర్ణయం.. ఇప్పటికే చాలా కాలంగా ఈ విషయం గురించి ఆలోచిస్తూ వస్తున్నానని.. కాస్త మంచిగా ఆడుతున్నప్పుడే రిటర్మెంట్ ప్రకటించడం ఉత్తమమని భావిస్తూ ఉన్నానని డివిలియర్స్ చెప్పాడు.

తన కెరీర్ లో ఇండియా, ఆస్ట్రేలియా లాంటి జట్లపై విజయాలు సాధించడం చాలా గొప్ప అంశమని.. ఇక తప్పుకోవడమే మంచి తరుణమని భావిస్తున్నానని చెప్పుకొచ్చాడు. తనను ఇన్నాళ్ళుగా వెన్నుగా నిలిచిన కోచ్ లకూ సౌత్ ఆఫ్రికా క్రికెట్ కూ ధన్యవాదాలు చెప్పుకుంటున్నానని మిస్టర్ 360 చెప్పాడు. ఇప్పటికైతే ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకుంటూ ఉన్నానని డొమెస్టిక్ క్రికెట్ లో టైటాన్స్ జట్టుకు మాత్రం ఆడుతానని చెప్పాడు. అలాగే సౌత్ ఆఫ్రికా జట్టుకు, డుప్లెసిస్ కు తన సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని ఏబీడీ చెప్పాడు. తనను ఇప్పటిదాకా సపోర్ట్ చేసిన సౌత్ ఆఫ్రికా క్రికెట్ అభిమానులకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ కు ధన్యవాదాలు చెబుతున్నానని ఏబీడీ పేర్కొన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here