కాలు కింద పెట్ట‌లేని భార్య‌ను చేతుల‌పై ఎత్తుకుని..పోలీస్‌స్టేష‌న్‌కు ఓ వ‌యో వృద్ధుడు!

భువ‌నేశ్వ‌ర్‌: కాలు కింద పెట్ట‌లేని స్థితిలో ఉన భార్య‌ను చేతుల‌తో ఎత్తుకుని పోలీస్‌స్టేష‌న్‌కు వ‌చ్చాడో వ‌యోధిక వృద్ధుడు. అత‌ని వ‌య‌స్సు సుమారు 70 సంవ‌త్స‌రాలు పైమాటే. ఆ స్థితిలోనూ క‌ట్టుకున్న భార్యను వ‌దిలి రాలేక‌పోయాడు. ఆమె న‌డ‌వ‌లేద‌ని తెలిసిన‌ప్ప‌టికీ.. చేతుల‌తో ఎత్తుకుని మోసుకుంటూ పోలీసుల వ‌ద్ద‌కు వ‌చ్చాడు. కార‌ణం.. అత‌ని కుమారుడే.

ఓ చిన్న విష‌యంలో త‌ల్లిదండ్రుల‌తో గొడ‌వ ప‌డ్డ ఓ క‌ఠినాత్ముడు వారిద్ద‌ర్నీ ఇంట్లో నుంచి గెంటేశాడు. లిట్ట‌రల్‌గా, మెడ‌ప‌ట్టి మ‌రీ గెంటేశాడు. దీనితో ఆ వ‌యోధిక వృద్ధ త‌ల్లిదండ్రులు పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. త‌మ‌కు న్యాయం చేయాల‌ని పోలీస్‌స్టేష‌న్ గ‌డ‌ప తొక్కారు. ఈ విషాద‌కర ఘ‌ట‌న ఒడిశాలోని కోరాపుట్ జిల్లా కోట్‌పాడ్‌లో చోటు చేసుకుంది.

ఆ వృద్ధ దంప‌తుల పేర్లు..సాను హ‌ల‌, ల‌చ్చ‌మ్మ హ‌ల‌. కోట్‌పాడ్ పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని కుసుమ్‌గూడ‌లో కుమారుడు, కోడ‌లు, మ‌న‌వ‌ళ్ల‌తో క‌లిసి నివాసం ఉంటున్నారు. ఇంటి ఆవ‌ర‌ణ‌లో పెరిగిన ఓ వెదురు చెట్టును తొల‌గించాడు సాను హ‌ల‌. అదే అత‌ను చేసిన త‌ప్పయింది. అత‌ని కుమారుడి ఆగ్ర‌హాన్ని తెప్పించింది. వృద్ధ త‌ల్లిదండ్రులో గొడ‌వ ప‌డ్డాడు.

వారిని ఇంటి నుంచి గెంటేశాడు. దీనితో వారు మ‌రో దారి లేక కోట్‌పాడ్ పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. ఈ సంద‌ర్భంగా తీసిన ఫొటోలు అవి. తాను స్వ‌యంగా న‌డ‌వ‌లేని స్థితిలో ఉన్న‌ప్ప‌టికీ.. భార్య ల‌చ్చ‌మ్మ‌ను చేతుల‌తో ఎత్తుకుని పోలీస్‌స్టేష‌న్ ఆవ‌ర‌ణ‌లో ప్ర‌వేశించ‌డం చూప‌రుల‌ను క‌ల‌చి వేసింది. త‌మ కుమారుడిపై వారు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు న‌మోదు చేశారు. సాను కుమారుడిని పిలిపించి, కౌన్సెలింగ్ ఇస్తామ‌ని సీఐ స‌మ‌ర్పితా స్వైన్ తెలిపారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here