రోడ్డు ప‌క్క‌న ఓ పేద్ద చెట్టు..దాని కింద ఓ పాత టీవీ! అది గాని!

భువ‌నేశ్వ‌ర్‌: ఒడిశాలోని కోరాపుట్‌-మల్కాన్‌గిరి జిల్లాల సరిహద్దులోని గోవింద ప‌ల్లి గ్రామం అది. జాతీయ రహదారికి ఆనుకుని ఉంటుందా గ్రామం. రోడ్డు ప‌క్క‌న ఓ చెట్టు కింద ఓ పాత టీవీ రెండు రోజుల నుంచీ అలాగే ప‌డి ఉంది. జాతీయ ర‌హ‌దారి కావ‌డంతో రోజూ వందలాది సంఖ్య‌లో వాహ‌నాలు రాక‌పోక‌లు సాగిస్తుంటాయి.

మూడురోజులుగా టీవీ అలాగే ప‌డి ఉండ‌టాన్ని గుర్తించిన స్థానికులు అనుమానించారు. ఎందుకైనా మంచిద‌నే ఉద్దేశంతో భ‌ద్ర‌తా ద‌ళాల‌కు స‌మాచారం ఇచ్చారు. వారి అనుమానం నిజ‌మైంది. స‌మాచారం అందుకున్న వెంట‌నే స్థానిక పోలీసులు, భ‌ద్ర‌తా బ‌ల‌గాలు సంఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్నాయి. టీవీని పరీక్షించ‌గా.. అందులో పెద్ద ఎత్తున ఐఈడీ క‌నిపించింది.

పాత టీవీని మందుపాత‌ర‌గా మార్చి అక్క‌డ ఉంచారు. ఇది మావోయిస్టుల ప‌నే అయి ఉంటుంద‌ని పోలీసులు. అనంత‌రం దాన్ని పేల్చివేశారు. మావోయిస్టుల కంచుకోటగా భావించే జిల్లాలు అవి. దండ‌కార‌ణ్యంలో ఉండే గ్రామం అది. నిత్యం ఈ మార్గంలో కూంబింగ్‌కు వెళ్లే బీఎస్‌ఎఫ్‌ దళాలను టార్గెట్‌గా చేసుకుని, మావోయిస్టులు దీన్ని అమ‌ర్చి ఉంటార‌ని అనుమానిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here