పాపం అబూ సలేంకు ఎంత కష్టం వచ్చిందో.. యూపీ ముఖ్యమంత్రికి లేఖ..!

తన దాకా వస్తే కానీ తెలీదంటారు. అచ్చం అలాంటిదే మాఫియా డాన్ అబూ సలేంకు జరిగింది. ఒకప్పుడు డబ్బుల కోసం, ఆస్థుల కోసం ఎంతో మందిని ఏడిపించిన.. వేధించిన అబూ సలేం.. ఇప్పుడు తన ఆస్థులను రక్షించాలని వేడుకుంటున్నాడు. అయినా అంత పెద్ద డాన్ ఇలా వేడుకుంది ఎవరిని అని అంటారా.. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను.. తన కష్టాలను తెలియజేస్తూ యోగి ఆదిత్యనాథ్ కు ఓ లేఖ రాశాడు పాపం.

ప్రస్తుతం తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న అబూసలేం లేఖ రాస్తూ అజంగఢ్‌ జిల్లాలోని తన పూర్వీకుల ఆస్థులు వేరే వాళ్ళు కొట్టేస్తున్నారంటూ బాధపడ్డాడు. వాటికి రక్షణ కల్పించాలని యోగిని కోరాడు. యోగితో పాటు జిల్లా జడ్జి , ఎస్పీలకు కూడా అబూ సలేం లేఖలు రాశాడట. అబూ సలేం న్యాయవాది రాజేష్‌ సింగ్‌ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాడు. అబూ సలేం పూర్వీకుల ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయని గతంలో ఫిర్యాదు చేశామని, వారు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీంతో నిందితులపై తామే సెక్షన్‌ 156 కేసు పెట్టామని తెలిపారు. 2013 భూ రికార్డుల ప్రకారం ఆ భూమికి సలేం, అతని సోదరుడు యజమానిగా ఉన్నారని, 2017లో రికార్డులు పరిశీలించగా, యజమాని పేరు మార్చేసి ఉందని ఆయన చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here