వంద కిలోమీట‌ర్ల వేగంగా టిప్ప‌ర్‌ను గుద్దిన ప్రైవేట్ బ‌స్! యాక్సిడెంట్‌..మామూలుగా లేదుగా!

సంగారెడ్డి: స‌ంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. అదృష్ట‌వ‌శావ‌త్తూ పెద్ద ఎత్తున ప్రాణ‌న‌ష్టం త‌ప్పింది. జిల్లాలోని జహీరాబాద్ మండలం బైపాస్‌రోడ్డులో ఓ ప్రైవేటు బ‌స్సు ప్ర‌మాదానికి గురైంది. అతి వేగంగా, ఏ మాత్రం నియంత్ర‌ణ లేని స్థితిలో దూసుకొచ్చిన ప్రైవేటు బ‌స్సు అదుపు త‌ప్పి, టిప్ప‌ర్‌ను ఢీ కొట్టింది.

ఈ ఘ‌ట‌న‌లో ఒక‌రు మ‌ర‌ణించారు. 10 మంది గాయ‌ప‌డ్డారు. గాయ‌ప‌డ్డ వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించి, చికిత్స అందిస్తున్నారు. జ‌హీరాబాద్ స‌మీపంలోని అలుగోలు క్రాస్‌రోడ్స్ వ‌ద్ద ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

క్రాస్‌రోడ్స్ వ‌ద్ద కుడివైపున‌కు మ‌ళ్లిన టిప్ప‌ర్‌ను ప్రైవేటు బ‌స్సు వేగంగా ఢీ కొట్టింది. అనంత‌రం రోడ్డు ప‌క్క‌నే ఉన్న స్తంభానికి బ‌లంగా ఢీ కొని నిలిచిపోయింది.

ప్రైవేటు బస్సు ముంబయి నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న జ‌హీరాబాద్‌ పోలీసులు దర్యాప్తు చేప‌ట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here