రోడ్డు మీద వెళుతున్నారు.. హోర్డింగ్ లో ఆ వీడియోలు ప్లే అయితే..!

సాధారణంగా రోడ్ల మీద అక్కడక్కడ హోర్డింగ్ లు ఏర్పాటు చేస్తూ ఉంటారు.. కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా డిజిటల్ హోర్డింగ్ లు కూడా ఉంటాయి. వాటి మీద వీడియోల రూపంలో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తూ ఉంటారు. అయితే అలాంటి హోర్డింగుల మీద ఏకంగా పోర్న్ వీడియోలు ప్లే అయితే.. అది కూడా విపరీతమైన ట్రాఫిక్ లో..! ఎంతో ఛండాలంగానూ.. ఎబ్బెట్టుగానూ అనిపించదు.

ఫిలిప్పీన్స్ ప్రజలకు అలాంటి ఘటనే ఎదురైంది. ఫిలిప్పీన్స్ ఆర్థిక రాజధాని మకాటి ప్రధాన రహదారి మధ్యలో ఉన్న భారీ హోర్డింగ్ పై ప్రకటన స్థానంలో అశ్లీల దృశ్యాలు వచ్చాయి. ఏకంగా 30 సెకెన్ల పాటు ఆ వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. వాటిని చూసిన స్థానికులు షాక్ కు గురయ్యారు. పక్కనే పిల్లలు ఉంటే వాళ్ళ కళ్ళు మూసేశారు కూడానూ.. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ కూడా అయింది. కొందరు యువకులు వాటిని సెల్ ఫోన్లలో బంధించి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో అవి వైరల్ గా మారాయి. దీనిపై ఫిర్యాదులందడంతో మకాటి మేయర్‌ అబిగేల్‌ బినయ్‌ దీనిని నిర్వహిస్తున్న గ్లోబల్ ట్రానిక్స్ సంస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ బిల్‌ బోర్డ్‌ ను మూసివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

ఆ దేశంలో పోర్నోగ్రఫీ అన్నది చాలా నేరం. దీనిపై ఆ దేశ ప్రతినిధులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. కావాలనే చేసారా.. లేక పొరపాటున అలా జరిగిందా అన్నది తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here