భ‌ర్త‌ను హ‌త‌మార్చి, దాన్ని దోపిడీ దొంగ‌ల ప‌నిగా చిత్రీక‌రించాల‌నుకుని..!

ఒక‌రిని ప్రేమించింది. పెద్ద‌ల బ‌ల‌వంతంతో మ‌రొక‌రిని పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లి న‌చ్చ‌క‌పోవ‌డం వ‌ల్లే క‌ట్టుకున్న భ‌ర్త‌ను హ‌త్య చేయ‌డానికి ప్ర‌య‌త్నించింది ఈ యువ‌తి. శ్రీ‌కాకుళం జిల్లా సంత‌బొమ్మాళికి చెందిన నీలిమ త‌న నేరాన్ని అంగీక‌రించింది. తాను వేరే యువ‌కుడిని ప్రేమించాన‌ని, పెద్ద‌లు త‌మ పెళ్లికి అంగీక‌రించ‌క‌పోవ‌డంతో వారి బ‌ల‌వంతం మేర‌కు న‌వీన్‌కుమార్‌ను పెళ్లాడాల్సి వ‌చ్చింద‌ని వెల్ల‌డించింది.

 

అందుకే- తాను భ‌ర్త‌ను హ‌త్య చేసి, దాన్ని దోపిడీ దొంగ‌ల ప‌నిగా చిత్రీక‌రించాల‌ని ప్లాన్ వేసిన‌ట్లు నీలిమ పేర్కొంది. ఈ దాడిలో క‌త్తి గాయాల‌తో న‌వీన్‌కుమార్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. సంత బొమ్మాళి మండ‌లంలోని మాలనర్సాపురం గ్రామానికి చెందిన బుడ్డ నవీన్‌కుమార్‌పై భార్య నీలిమ క‌త్తితో దాడి చేసి, హ‌త్య చేయ‌డానికి ప్ర‌య‌త్నించిన విష‌యం తెలిసిందే.

వేరొకరితో ప్రేమ వ్యవహారం నడుస్తుండడంతో ఇష్టం లేకపోయినా బలవంతంగా పెళ్లి చేయడంతో నీలిమ ఈ దారుణానికి పూనుకుందని ఆమె అంగీక‌రించిన‌ట్లు సంత‌బొమ్మాళి పోలీసులు తెలిపారు. ప్లాన్‌ ప్రకారం వెంట తెచ్చుకున్న చాకుతో మూలనర్సాపురం సమీప తోటల్లో దాడి చేసిందన్నారు. నేరం ఒప్పుకున్నందున కేసు నమోదు చేసి, ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించామని ఎస్‌ఐ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here