డ్రైవర్.. యజమాని భార్యతో లవ్ అఫైర్.. అందుకు విధించిన శిక్ష..!

డ్రైవర్ యజమాని భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇది తెలిసిన యజమాని ఏ శిక్ష విధించాడంటే.. ఏకంగా అతడి కళ్ళల్లో యాసిడ్ పోశాడు. ఈ దారుణమైన ఘటన బీహార్ లో చోటుచేసుకుంది.

సమస్తిపూర్ జిల్లాకు చెందిన బాధితుడు బరౌనీ గ్రామంలో ఓ భూస్వామి వద్ద గౌతమ్ ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు. బుద్ధిగా ఉండకుండా ఇద్దరు పిల్లలకు తల్లి అయిన అతని భార్యతో గౌతమ్ సంబంధాన్ని పెట్టుకున్నాడు. ఈ నెల 6వ తేదీన వారిద్దరూ కలసి పారిపోయారు. అతనిపై కిడ్నాప్ కేసు కూడా నమోదైంది. 16వ తేదీన వారిద్దరినీ తీసుకొని వచ్చి కోర్టులో హాజరు పరిచారు. భర్తతో కలసి వెళ్లాలని కోర్టు సూచించింది. ఆపై భర్త వద్దకు వచ్చిన తరువాత కూడా, తాను డ్రైవర్ తోనే ఉండాలని భావిస్తున్నట్టు తెలిపింది.

దీంతో కోపోద్రిక్తుడైన ఆ మహిళ భర్త.. తన బావమరిదిని.. మరికొందరిని వెంట తీసుకొని చిన్న హోటల్ లో ఉన్న బాధితుడిని బయటకు లాక్కొచ్చారు. తీవ్రంగా కొట్టి అతడి కళ్లల్లో ఓ సిరంజి సాయంతో యాసిడ్ పోశారు. ఆపై హనుమాన్ చౌక్ సమీపంలో పడేసి పోయారు. స్థానికులు అతన్ని ఆసుపత్రిలో చేర్పించారు. అతడి కంటి చూపు పోయినట్టు వైద్యులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here