బెట్టింగ్ వేశానని ఒప్పేసుకున్న సల్మాన్ సోదరుడు.. ఎంత పోగొట్టుకున్నాడో తెలుసా..?

ఐపీఎల్ బెట్టింగ్ లో పాల్గొన్నానన్న అభియోగాలపై అర్బాజ్ ఖాన్ స్పందించాడు. సల్మాన్ సోదరుడు, యాక్టర్, ప్రొడ్యూసర్ అయిన అర్భాజ్ ఖాన్ ను ముంబై పోలీసులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే..! దీనిపై ఈ రోజు అర్భాజ్ పోలీసుల్ అముండు హాజరయ్యాడు. అతడు ఐపీఎల్ బెట్టింగ్ లో పాల్గొన్నాడన్న సాక్ష్యాలు పోలీసుల దగ్గర ఉండడంతో ఒప్పుకోకతప్పలేదు. తాను 2017 లోనూ.. ఈ ఏడాది ఐపీఎల్ లోనూ బెట్టింగ్ కు పాల్పడ్డానని చెప్పాడు. అయితే మొత్తం ఎంత పోగొట్టుకున్నాడో తెలుసా..? 2.75 కోట్లు..!

అర్భాజ్ ఖాన్ గత ఆరేళ్ళుగా బెట్టింగ్ లో పాల్గొంటూనే ఉన్నాడని పోలీసుల వద్ద సమాచారం ఉంది. బెట్టింగ్ రాకెట్ తో కూడా సంబంధాలు ఉన్నట్లు పోలీసుల దగ్గర మొత్తం సమాచారం ఉంది. ఈ క్రమంలో పోలీసుల ఎదుట హాజరైన అర్భాజ్ ఖాన్.. జలన్‌తో సంబంధాలను అంగీకరించాడని తెలుస్తోంది. బెట్టింగ్‌లో డబ్బులు పెట్టినట్లు ఒప్పుకున్నాడని.. గత ఐపీఎల్‌ సీజన్‌తో బెట్టింగ్‌ ద్వారా రూ.2.75 కోట్లు పొగొట్టుకున్నట్లు అర్బాజ్‌ చెప్పినట్లు తెలుస్తోంది. ఐదేళ్లుగా బుకీ జలన్‌ తెలుసని, గత కొంత కాలంగా తాను బెట్టింగ్‌లో డబ్బులు పెడుతున్నానని చెప్పేశాడు. ‘బెట్టింగ్‌లో ఓడిపోయిన డబ్బును అర్బాజ్‌ చెల్లించకపోవటంతో జలన్‌ బెదిరింపులకు పాల్పడ్డాడు. అవసరమైతే ఈ విషయంలో సల్మాన్‌ను నిలదీస్తామని వారు బెదిరించారని’ ఓ వర్గం మీడియా స్పష్టం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here