ఐపీఎల్ బెట్టింగ్ లో సల్మాన్ సోదరుడి పేరు..!

ఐపీఎల్ బెట్టింగ్ ఎంతో మంది జీవితాలను ఇప్పటికే నాశనం చేసింది. గల్లీ నుండి ఢిల్లీ దాకా అందరూ ఆడుతున్న వాళ్ళే..! పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ పని చేస్తున్నారని అందరూ చెప్పుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళ పేర్లు అంత ఈజీగా బయటకు రావు. తాజాగా ఓ బడా సెలెబ్రిటీ పేరే బయటకు వచ్చింది.

అతడు ఎవరో కాదు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్..! నటుడు, ప్రొడ్యూసర్ అయిన అర్భాజ్ ఖాన్ కు బెట్టింగ్ లో ప్రమేయం ఉందని ముంబై పోలీసులు అనుమానిస్తున్నారు. థానే పోలీసులు ఈ విషయంపై అతని స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. ఇటీవల పోలీసులు బుకీ అయిన సోనూ జలన్ ను అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం సోనూ ను అరెస్ట్ చేసిన పోలీసులు అతన్ని విచారించగా అర్భాజ్ ఖాన్ పేరు బయటకు వచ్చింది. దీంతో పోలీసులు అర్భాజ్ ఖాన్ కు సమన్లు జారీ చేశారు. సల్మాన్ ఖాన్ సోదరుడైన అర్భాజ్ ఖాన్ యాక్టర్ మాత్రమే కాకుండా ప్రొడ్యూసర్ కూడానూ..! సోనూ జలాన్ సాయంతో బెట్టింగ్ లకు పాల్పడినట్లు పోలీసులకు సమాచారం అందింది. అంతేకాకుండా సోనూ జలాన్ దగ్గర ఉన్న డైరీలో క్లయింట్లకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో చాలా పెద్ద వాళ్ళు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నెక్స్ట్ ఎవరి పేర్లు బయటకు వస్తాయో..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here