ఎన్టీఆర్ బ‌యోపిక్! అంతా రెడీ! క్లాప్ కొట్టేది ఎవ‌రంటే..?

హైద‌రాబాద్‌: మ‌హాన‌టుడు, మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీ రామారావు బ‌యోపిక్ షూటింగ్‌కు స‌ర్వం సిద్ధ‌మైంది. దీనికోసం నాచారంలోని రామ‌కృష్ణ స్టూడియోలో శ‌ర‌వేగంగా స‌న్నాహాలు సాగుతున్నాయి. గురువారం ఉద‌యం ఈ సినిమాకు క్లాప్ కొట్ట‌నుంది చిత్రం యూనిట్‌. ముఖ్యఅతిథిగా ఉప రాష్ట్రప‌తి ఎం వెంక‌య్య‌నాయుడు హాజ‌రు కానున్నారు.

ఈ మూవీకి సంబంధించిన ఇన్విటేష‌న్ కార్డ్ ఇదేనంటూ ఓ పిక్.. సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తోంది. సినిమా పేరు `య‌న్‌.టీ.ఆర్‌..` బాల‌కృష్ణ టైటిల్ పాత్ర‌ను పోషిస్తున్నారు. నిజానికి-ఈ సినిమాతో బాల‌కృష్ణ పూర్తిస్థాయి నిర్మాత‌గా మారుతార‌ని, దీనికోసం ఆయ‌న స్వ‌యంగా ఓ ప్రొడక్ష‌న్ హౌస్‌ను కూడా ఏర్పాటు చేశారంటూ వార్త‌లు వ‌చ్చాయి.

ఇన్విటేష‌న్ కార్డు మాత్రం దీనికి కంప్లీట్ డిఫ‌రెంట్‌గా ఉంది. వారాహి చ‌ల‌న చిత్ర బ్యాన‌ర్‌పై సాయి కొర్ర‌పాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆయ‌న‌తో పాటు బాల‌కృష్ణ కో ప్రొడ్యూస‌ర్‌గా ఉంటార‌ని చెబుతున్నారు. సినిమా ఖ‌ర్చులో, వ‌చ్చే లాభాల్లో అధిక భాగం బాలకృష్ణకేన‌ని అంటున్నారు. తేజ ద‌ర్శ‌కుడు. ఎంఎం కీర‌వాణి సంగీతాన్ని అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here