బాల‌య్య‌..దుర్యోధ‌నుడి గెట‌ప్‌లో!..రెగ్యుల‌ర్ షూటింగ్ జాప్యం!

హైద‌రాబాద్‌: విశ్వ‌విఖ్యాత న‌ట సార్వ‌భౌముడు, మాజీ ముఖ్య‌మంత్రి ఎన్టీ రామారావు బ‌యోపిక్‌కు క్లాప్ కొట్టేశారు. హైద‌రాబాద్ నాచారాంలోని రామ‌కృష్ణ స్టూడియోలో దుర్యోధునుడి గెట‌ప్‌లో ఉన్న బాల‌కృష్ణ‌పై ముహూర్త‌పు షాట్‌ను తీశారు. ఉప రాష్ట్రప‌తి ఎం వెంక‌య్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజ‌ర‌య్యారు. తొలిషాట్‌కు క్లాప్ కొట్టారు.

ద‌ర్శ‌కేంద్రుడు కె రాఘ‌వేంద్ర‌రావు, బ‌యోపిక్ ద‌ర్శ‌కుడు తేజ‌, వీవీ వినాయ‌క్‌..ఇలా హేమాహేమీలంద‌రూ ముహూర్త‌పు షాట్‌కు హాజ‌ర‌య్యారు. దీనికోసం రామ‌కృష్ణ స్టూడియోలో కౌరవ సామ్రాజ్య సెట్‌ను వేశారు. అదే సెట్‌లో ముహూర్త‌పు షాట్‌ను తీశారు. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ జూన్ లేదా జులై నుంచి మొద‌ల‌య్యే అవ‌కాశాలు ఉన్న‌ట్టు చెబుతున్నారు.

 

‘దాన వీర శూర కర్ణ’ చిత్ర షూటింగ్‌ను ఇప్పటి బయోపిక్‌లో తొలి షాట్‌గా చిత్రీకరించారు. దృతరాష్ట్రుడు పాత్రలో కోట శ్రీనివాసరావు నటించారు. ‘యన్.టి.ఆర్’ చిత్ర ప్రారంభోత్సవానికి నందమూరి కుటుంబ సభ్యులు సహా అతిరథ మహారథులు తరలివచ్చారు.

తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, నందమూరి రామకృష్ణ, అంబికా కృష్ణ, బి.రాఘవేంద్రరావు, ఎం.ఎం.కీరవాణి, రాజశేఖర్, బి.గోపాల్, పూరీ జగన్నాథ్, చార్మి, అలనాటి నటి జమున, కె.ఎస్.రవికుమార్ తదితరులు హాజరయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here