`మీ నాన్న ఎంత స్టార్ హీరో అయితే మాత్రం.. నా ముందు నీ ప‌ప్పులు ఉడ‌క‌వ్‌..!`

త‌ల్లికి భ‌య‌ప‌డి, బుద్ధిగా పాల గ్లాస్‌ను ఖాళీ చేస్తోన్న ఆ చిన్నారి మ‌రెవ‌రో కాదు.. అభ‌య్ రామ్‌. జూనియ‌ర్ ఎన్టీఆర్ కుమారుడు. అత‌ని ఎదురుగా నిల్చుని ఉరిమే క‌ళ్ల‌తో చూస్తున్న‌ది త‌ల్లి ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి. త‌న కుమారుడు చెప్పిన‌ట్టు విన‌క‌పోతే- ఏ త‌ల్లికైనా కోపం న‌షాళానికి అంటుతుంది.

https://twitter.com/tarak9999/status/1005393289766289408

ప్ర‌ణతి ఏ రేంజ్‌లో అభ‌య్‌రామ్‌ను భ‌య పెట్టారో గానీ.. బుద్ధిగా ఓ చోట కూర్చుని పాల గ్లాసును ఖాళీ చేశాడు. నువ్వెంత స్టార్ హీరో కుమారుడైతే మాత్రం.. నీ ప‌ప్పులు నా ద‌గ్గ‌ర ఉడ‌క‌వ్. చెప్పిన‌ట్టు వినాల్సిందే` అనే సందేశాన్ని ఇస్తోంది ఈ పిక్‌. దీన్ని ఎన్టీఆర్ త‌న సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోకు వెన్నెల కిశోర్ ఇచ్చిన రిప్ల‌య్ భ‌లే ఆక‌ట్టుకుంటోంది.

https://twitter.com/vennelakishore/status/1005394569427501056

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here