హీరో కుమారుడు ఈత‌లో మొన‌గాడు..!

చెన్నై: హీరో పిల్ల‌లు హీరోలు కావ‌డమో, ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే రాణించ‌డం కామ‌న్‌. ఆ హీరో కుమారుడు మాత్రం క్రీడ‌ల ప‌ట్ల ఆస‌క్తి చూపాడు. స్విమ్మర్‌గా రాణించాడు. 12 ఏళ్ల వ‌య‌స్సులోనే అంత‌ర్జాతీయ స్థాయి గుర్తింపు సాధించాడు. ఆ హీరో.. మాధ‌వ‌న్‌. ఆయ‌న కుమారుడు వేదాంత్‌. వేదాంత్‌ స్విమ్మింగ్‌ పోటీల్లో కాంస్య పతకం సాధించాడు.

థాయ్‌లాండ్‌లో జ‌రిగిన అంత‌ర్జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో వేదాంత్ ఈ ఘ‌న‌త‌ను సాధించాడు. ఈ విష‌యాన్ని మాధ‌వ‌న్‌.. త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. వేదాంత్ పాఠ‌శాల స్థాయి నుంచే ఈత పోటీల్లో పాల్గొనే వాడు. త‌న కుమారుడికి ఈతలో ఆస‌క్తి ఉండ‌టాన్ని గ‌మ‌నించిన తాను అందులో ప్రోత్స‌హించాన‌ని చెప్పారు.

థాయ్‌లాండ్ అంత్జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో కాంస్య ప‌త‌కాన్ని సాధించ‌డం ప‌ట్ల ఆనందంగా ఉందంటూ మాధ‌వ‌న్ ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. వేదాంత్ వ‌య‌స్సు 12 సంవ‌త్స‌రాలు. మాధ‌వ‌న్‌, స‌రితల కుమారుడు. 2000లో మాధ‌వ‌న్‌, స‌రిత‌ల పెళ్ల‌యింది. వారిది ప్రేమ వివాహం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here