టాలీవుడ్‌, మీడియా అండ్ పాలిటిక్స్‌! సినీ క‌ళామ‌త‌ల్లి బిడ్డ‌గా ఈ లేఖ రాస్తున్నా..!

హైద‌రాబాద్‌: కాస్టింగ్ కౌచ్, శ్రీ‌రెడ్డి వ్య‌వ‌హారాల‌తో స‌హా కొద్దిరోజులుగా తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో చెల‌రేగుతున్న వివాదాల‌పై మంచువార‌బ్బాయి మ‌నోజ్ స్పందించారు. సినీ క‌ళామ‌త‌ల్లికి ఈ లేఖ రాస్తున్నానంటూ సోమ‌వారం సాయంత్రం ఆయ‌న ఓ బ‌హిరంగ లేఖ‌ను త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు.

కౌచ్ అనేది ఒక్క కాస్టింగ్‌లోనే లేద‌ని, కార్పొరేట్‌, పాలిటిక్స్‌, మీడియా, బ్యాంకింగ్‌.. ఇలా అన్ని రంగాల్లోనూ ఈ జాఢ్యం ఉంద‌ని అన్నారు. కాస్టింగ్ కౌచ్ ఒక్క‌దాన్ని అడ్డు పెట్టుకుని చిత్ర ప‌రిశ్ర‌మ‌ను నిందించ‌డం స‌రికాద‌ని చెప్పారు. మ‌న చేత‌నైనంత వ‌ర‌కు, మ‌న‌కు అందుబాటులో ఉన్నంత వ‌ర‌కు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఉన్న కాస్టింగ్ కౌచ్ వ్య‌వ‌హారాన్ని క‌లిసిక‌ట్టుగా నిర్మూలించుకుందామ‌ని అన్నారు.

 

మ‌హిళ‌ల‌కు గౌర‌వం ఇచ్చే అంశంపై ప‌వ‌న్ క‌ల్యాణ్ పోరాడుతున్నార‌ని, దీనికి తాను మ‌ద్ద‌తు ఇస్తున్నాన‌ని చెప్పారు. కాస్టింగ్ కౌచ్‌, శ్రీ‌రెడ్డి వ్య‌వ‌హారాన్ని మీడియా అన‌వ‌స‌రంగా ర‌చ్చ చేసింద‌ని, ఈ విష‌యాన్ని ఇంత‌కంటే మెరుగ్గా జ‌నంలోకి తీసుకుని వెళ్లి ఉండొచ్చ‌ని మంచు మ‌నోజ్ అభిప్రాయ ప‌డ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here