నాగ్ ఆలియాస్ ఆఫీస‌ర్‌..నెరిసిన జుట్టుతో!

హైద‌రాబాద్‌: అక్కినేని నాగార్జున-రామ్‌గోపాల్‌ వర్మ కాంబినేషన్‌లో తెర‌కెక్కుతోన్న చిత్రం ‘ఆఫీసర్’. ఈ మూవీ టీజర్ సోమ‌వారం విడుద‌లైంది. `గోవింద గోవిందా` త‌రువాత వారిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న సినిమా కావ‌డంతో హైప్ క్రియేట్ అయ్యింది. ఈ హైప్‌ను అందుకునేలా క‌నిపిస్తోందీ మూవీ.

రామ్‌గోపాల్ వ‌ర్మ‌కు బాగా అచ్చొచ్చిన అండ‌ర్ వ‌ర‌ల్డ్ మాఫియా క‌థ‌గా క‌నిపిస్తోంది. హైద‌రాబాద్ నుంచి ముంబై వెళ్లి.. అక్క‌డ మాఫియా ప‌ని ప‌ట్టే అధికారిగా నాగ్ క్యారెక్ట‌ర్‌ను తీర్చిదిద్దారు.  రెగ్యుల‌ర్ సినిమాల్లోలాగా కాకుండా నాగార్జున కాస్త డిఫ‌రెంట్‌గా ఉన్నారు. నెరిసిన జుట్టుతో ఆయ‌న న‌టించారు.

‘మొదలు పెట్టిన దానిని పూర్తి చేయడం నా బాధ్యత’ అనే డైలాగ్ డెలివ‌రీ.. నాగ్ స‌త్తా ఏమిటో చెబుతోంది. నాగార్జున స‌ర‌స‌న కొత్త‌మ్మాయి మైరా సరీన్ న‌టిస్తోంది. వర్మ మార్క్ కెమెరా యాంగిల్స్‌, యాక్ష‌న్ సీన్స్.. స్ట‌యిల్ చూస్తోంటే.. హిట్ గ్యారెంటీ అనిపిస్తోంది. మే 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here