ఛత్రపతి ‘బాజీరావ్’ ఇక లేరు..!

ప్రభాస్ సినిమాలలో ‘ఛత్రపతి’ సినిమా ఒక ట్రెండ్ సెట్టర్.. రాజమౌళి అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమాలో బాజీరావ్ పాత్ర అందరికీ గుర్తే ఉంటుంది. ఆ క్యారెక్టర్ చేసిన ‘నరేంద్ర ఝా’ ఇక లేరు. ఈరోజు ఉదయం నాసిక్ లో నరేంద్ర మరణించారు. హార్ట్ అటాక్ కారణంగా ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నరేంద్ర వయసు 55 సంవత్సరాలే..!

బీహార్ కు చెందిన నరేంద్ర ఝా ను ‘మిస్టర్ ఝా’ అని ఫిలిం సర్కిల్స్ లో పిలుస్తారు. ఆయన తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా హిందీ సినిమాలలోనూ, టీవీ సీరియల్స్ లోనూ ఎక్కువగా నటించారు. తెలుగులో యమదొంగ, లెజెండ్ చిత్రాల్లో నటించిన నరేంద్ర ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ చిత్రంలో కూడా నటించినట్లు తెలుస్తోంది. రయీస్, కాబిల్, ఫోర్స్-2, హమారీ అధూరి కహానీ, ఘయాల్, హైదర్ లాంటి సినిమాల్లో నటించాడు. ఆయన మృతికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here