క‌ర్ణాట‌క సీఎం ప్ర‌మాణ స్వీకారోత్స‌వంలో స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచిన హీరో!

క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా హెచ్‌డీ కుమార‌స్వామి ప్ర‌మాణ స్వీకారోత్స‌వంలో ఓ హీరో త‌ళుక్కున మెరిశారు. ఆయ‌నే నిఖిల్ కుమార్ గౌడ‌. జాగ్వార్ సినిమా హీరో. తెలుగులోనూ అదే పేరుతో విడుద‌లైన ఈ సినిమాతో టాలీవుడ్‌కు ప‌రిచ‌యం అయ్యారు. కుమారస్వామి ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వం ముగిసిన వెంట‌నే- వేదిక‌పైకి ఎక్కారు. ఆయ‌న‌తో క‌లిసి గ్రూప్ ఫొటో దిగారు.

అంద‌ర్నీ ప‌ల‌క‌రిస్తూ, చ‌లాకీగా క‌నిపించారు. ఓ ముఖ్య‌మంత్రి ప్ర‌మాణ స్వీకారోత్స‌వంలో ఆ హీరో అంత చురుగ్గా వ్య‌వ‌హ‌రించ‌డానికి కార‌ణం.. ఆయ‌న కుమార‌స్వామి కుమారుడు. మాజీ ప్ర‌ధాని దేవేగౌడ మ‌న‌వ‌డు, క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి కుమార‌స్వామి కుమారుడు నిఖిల్‌. ప్ర‌స్తుతం ఆయ‌న హీరోగా రెండో మూవీ రెడీ అవుతోంది. ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుపుకొంటోందీ సినిమా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here