జ‌ర్న‌లిస్ట్ అర్జున్ లెనిన్ సుర‌వ‌రం!

యంగ్ హీరో నిఖిల్ న‌టిస్తోన్న తాజా చిత్రానికి `ముద్ర‌` అనే టైటిల్ ఖాయం చేశారు. లావ‌ణ్య త్రిపాఠి క‌థానాయిక‌. మూవీ డైన‌మిక్స్ ఎల్ఎల్‌పీ, అరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. బీ మ‌ధు స‌మ‌ర్ప‌కుడు. టీఎన్ సంతోష్ ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నారు. మూవీ క‌థ కూడా ఆయ‌న‌దే. రాజ్‌కుమార్ ఆకెళ్ల‌, కావ్యా వేణుగోపాల్ నిర్మాత‌లు. శామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు.

నిఖిల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను విడుద‌ల చేసింది చిత్రం యూనిట్‌. ఇందులో నిఖిల్ జ‌ర్న‌లిస్ట్‌గా న‌టిస్తున్నారు. త‌మిళ టాప్ హీరో జీవా న‌టించిన రంగం సినిమా కూడా త‌ర‌హాలో ఉంటుంద‌నే టాక్ ఉంది. అందులో కూడా జీవా ఫొటో జ‌ర్న‌లిస్ట్‌గా న‌టించాడు. కిర్రాక్ పార్టీ ఫ్లాప్ త‌రువాత నిఖిల్ న‌టిస్తోన్న సినిమా ఇది. శ‌ర‌వేగంగా ఈ సినిమా షూటింగ్ జ‌రుపుకొంటోంది. విడుద‌ల తేదీ ఇంకా నిర్ణ‌యించలేదు. టీవీ 99 ఫొటో జ‌ర్న‌లిస్ట్‌గా న‌టిస్తున్నారు. ఇందులో నిఖిల్ క్యారెక్ట‌ర్ పేరు అర్జున్ లెనిన్ సుర‌వ‌రం.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here