ప్ర‌భుదేవా బాగానే భ‌య‌పెడుతున్నాడుగా!

చెన్నై: ఇండియ‌న్ మైకెల్ జాక్స‌న్ ప్ర‌భుదేవా న‌టిస్తోన్న తాజా చిత్రం `మెర్క్యురి`. కార్తీక్ సుబ్బ‌రాజు ద‌ర్శ‌కుడు. ఇదో హార‌ర్, అడ్వెంచ‌ర‌స్ థ్రిల్ల‌ర్‌. ఇందులో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు ప్ర‌భుదేవా. ఇదొక మాట‌ల్లేని సినిమా. సినిమాలో ఎక్క‌డా మాట‌లే ఉండ‌వు.

సైలెంట్‌గా సాగిపోతుందట ఈ మూవీ. ఇదోక ప్ర‌యోగ‌త్మాక‌మే. గ‌తంలో పుష్ప‌క విమానం పేరుతో క‌మ‌ల్ హాస‌న్‌-సింగీతం శ్రీ‌నివాస‌రావు వెండితెర‌పై ఓ అద్భుతాన్నే సృష్టించారు. ఆ త‌రువాత కంప్లీట్ మూకీ మూవీ మ‌ళ్లీ ఎప్పుడూ రాలేదు. ఇప్పుడు తాజాగా కార్తీక్ సుబ్బ‌రాజు-ప్ర‌భుదేవాల కాంబోలో మూకీ మూవీ తెర‌కెక్కింది.

మెర్క్యురి విషం బారిన ప‌డి 84 మంది గ్రామ‌స్తులు మ‌ర‌ణించిన గ్రామానికి కొంద‌రు యువ‌తీ యువ‌కులు సాహ‌స యాత్ర‌కు బ‌య‌లుదేర‌డం, ఓ పాడుబ‌డ్డ ఇంట్లో చిక్కుకుపోవ‌డం, అక్క‌డ సీరియ‌ల్ కిల్ల‌ర్ లేదా సైకో కిల్ల‌ర్‌ ప్ర‌భుదేవా బారిన ప‌డ‌టం.. ఈ మూవీ క‌థ‌. గొంతు వినిపిస్తే.. కిల్ల‌ర్ త‌మ వెంట‌ప‌డ‌తాడోన‌నే భయంతో వారంద‌రూ బిక్కు బిక్కుమంటూ గ‌డప‌డం ఈ టీజ‌ర్‌లో క‌నిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here