మధ్యలోనే స్టేజీ దిగి వెళ్ళిపోయిన ప్రకాష్ రాజ్.. అందరూ షాక్..!

భరత్ బహిరంగ సభను ఎంతో అట్టహాసంగా నిర్వహించారు. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ సమయంలో ప్రకాష్ రాజ్ ఎందుకు అలా చేశారా అని మాట్లాడుకుంటూ ఉన్నారు. అందుకు కారణం ఉన్నట్లుండి స్టేజి దిగేసి వెళ్ళిపోవడమే..!

ప్రకాష్ రాజ్ మాట్లాడుతుండగా.. మధ్యలో కొందరు అభిమానులు.. ‘ఫాదర్ ఫాదర్’ అంటూ నినాదాలు చేశాడు. ఆయన తన ప్రసంగం ఆపేసి నవ్వుతూనే ఏంటి ఏంటి అని ఆ నినాదాలు చేసిన వాళ్ల వైపు చూశారు. వాళ్లు మళ్లీ ‘ఫాదర్ ఫాదర్’ అన్నారు. వేదిక మీద ఉన్న వాళ్లు ప్రకాష్ రాజ్ కు విషయం చెప్పారు. అంతే.. ఆయన హఠాత్తుగా తన ప్రసంగాన్ని ఆపేసి వేదిక దిగిపోయారు. ఇంతకూ ప్రకాష్ రాజ్ ఎందుకు ఇలా చేశాడు అని ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు.

https://twitter.com/Telusuko/status/982665268924121089

గతంలో ఇలాంటి ఎన్నో సభలలో అభిమానులు అడ్డంగా నినాదాలు చేశారు. కానీ ఎందుకో ప్రకాష్ రాజ్ వాటిని ఏమీ పట్టించుకోకుండా సైలెంట్ గా దిగి వెళ్ళిపోయారు. కింద ఉన్న ఎన్టీఆర్, మహేష్ బాబు, కొరటాల శివ కూడా షాక్ గా చూస్తూ ఉండిపోయారు. ఆ తర్వాత కూడా ఆయన కనిపించలేదు. ఎందుకు ప్రకాష్ రాజ్ ఇలా చేశారా అని అందరూ ప్రశించుకుంటూ ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here