తాగి గొడవ పెట్టుకున్న యాంకర్ మాజీ భర్త, యాక్టర్ రాజా..!

హిందీ సీరియల్ నటి, యాంకర్ అయిన శ్వేత తివారీ మాజీ భర్త రాజా చౌధరీ తాగి గొడవకు దిగాడు. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఫుల్ గా మద్యం తాగేసిన రాజా.. కొందరితో వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత వాళ్ళను ఎలా పడితే అలా తిట్టాడు. దీంతో పోలీసులు అతడిపై కేసును నమోదు చేశారు. రాజా చౌదరీ హిందీ బిగ్ బాస్ సీజన్-2 ద్వారా బాగా ఫేమస్ అయ్యాడు.

తాము రాజా మీద పోలీసు కేసు నమోదు చేశామని.. అతన్ని మెడికల్ టెస్టుల కోసం పంపించామని కాన్పూర్ వెస్ట్ ఎస్పీ సంజీవ్ సుమన్ తెలిపారు. ఇతడు బాలీవుడ్ టెలివిజన్ ఇండస్ట్రీలో ఫేమస్ అయిన శ్వేతా తివారీ మాజీ భర్త. ఈమె డబ్బింగ్ సీరియల్స్ ద్వారా తెలుగు వాళ్లకు కూడా పరిచయమే.. చాలా హిందీ టీవీ షోలకు యాంకర్ గా పనిచేసింది.

ఇక రాజా చౌదరి జీవితం మొత్తం వివాదాలమయమే..! శ్వేతా తివారిని 1998లో పెళ్ళి చేసుకున్నాడు. ఆమెను హింసించేవాడు కూడా. 2007 లో విడిపోయిన వీరికి 2012లో విడాకులు మంజూరయ్యాయి. 2011లో ముంబై పోలీసులు అతన్ని ఒకసారి అరెస్ట్ చేశారు. తన పొరుగింటి వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ తో సిమ్ కార్డు తీసుకోవడంతో పోలీసులు అతన్ని అప్పుడు అరెస్ట్ చేశారు. ఇక విడాకులు మంజూరు అయిన తర్వాత కూడా శ్వేత తివారిని ఇబ్బందులకు గురిచేస్తూ ఉండడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. దీంతో అతన్ని ముంబై వదిలిపెట్టమని పోలీసులు కోరారు. 2013లో శ్వేత తివారి అభినవ్ కోహ్లీని రెండో పెళ్ళి చేసుకుంది.. ఇక రాజా 2015లో శ్వేత సూద్ ను పెళ్ళి చేసుకున్నాడు. ఇప్పుడు అతడు మరోసారి వార్తల్లో నిలిచాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here