ఎడ్జ్ ఆఫ్ ద సీట్‌..అడ్వెంచ‌ర్ మూవీ!

హైద‌రాబాద్‌: ఎన‌ర్జిటిక్ హీరో రామ్ కొత్త మూవీకి కొబ్బ‌రికాయ కొట్టారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ల‌బోతోంది. ఇదొక అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్‌. ఈ త‌ర‌హా సినిమాలో న‌టించ‌డం రామ్‌కు ఇదే తొలిసారి. ఇప్ప‌టిదాకా అత‌ను యూత్‌ఫుల్, ల‌వ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌లో మాత్ర‌మే క‌నిపించాడు.

ఈ సారి కొత్త‌గా అడ్వెంచ‌ర్ మూవీ చేస్తున్నాడు. ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌కుడు. రాజ‌శేఖ‌ర్‌తో `గ‌రుడ వేగ` త‌రువాత ప్ర‌వీణ్ స‌త్తారు చేస్తోన్న త‌రువాతి ఫిల్మ్ ఇదే. గురువారం ఈ సినిమాకు క్లాప్ కొట్టారు. స్ర‌వంతి మూవీస్ బ్యాన‌ర్‌పై ర‌వికిశోర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ బ్యాన‌ర్ రామ్‌కు హోమ్ ప్రొడ‌క్ష‌న్‌. రెగ్యులర్ షూటింగ్ వ‌చ్చేనెల 7వ తేదీ నుంచి జార్జియాలో మొద‌ల‌వుతుంది.

స్విట్జ‌ర్లాండ్‌, ఫ్రాన్స్, ఇట‌లీలో చిత్రీక‌ర‌ణ జ‌ర‌పుకోనుంది. విదేశాల నుంచి తిరిగి వ‌చ్చాక కాశ్మీర్‌, ల‌డ‌ఖ్‌లో భారీ షెడ్యూల్స్ ప్లాన్ చేసిన‌ట్టు యూనిట్ చెబుతోంది. ప్రేక్ష‌కుడిని థియేట‌ర్‌లో సీటు చివ‌రి అంచుల్లో కూర్చోబెట్టేలా సినిమా ఉంటుంద‌ని ద‌ర్శ‌కుడు చెబుతున్నాడు. రామ్ స‌ర‌స‌న కాజల్ హీరోయిన్‌గా న‌టించ‌నుంది. టైటిల్ ఏమిట‌నేది ఇంకా రివీల్ కాలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here