హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసుకున్నాడు..నెత్తి పుండ‌యింది!

ఈ ఫొటోలో క‌నిపిస్తోన్న వ్య‌క్తి పాకిస్తానీ న‌టుడు. ఆ దేశంలో ఆయ‌న‌కు స్టార్ ఇమేజ్ ఉంది. పేరు సాజిద్ హ‌స‌న్‌. ప‌లు సూప‌ర్‌హిట్ సినిమాల్లో న‌టించారాయ‌న‌.

ఇటీవ‌లే హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసుకున్నారు. దీని ఫలితం.. ఇప్పుడు మీరు చూస్తున్న‌దే! హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ విక‌టించ‌డంతో.. త‌ల‌పై పెద్ద పుండు ఏర్ప‌డింది.

ఈ పుండుతో చాలా ఇబ్బందులు ప‌డుతున్నానంటూ ఆయ‌న ఓ సెల్ఫీ వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ పుండు పోవాలంటే స‌ర్జ‌రీ చేయాలంటూ డాక్ట‌ర్లు చెబుతున్నార‌ట‌. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచిస్తూ ఆయ‌న ఈ సెల్ఫీ వీడియోను పోస్ట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here