నా భ‌ర్త గే, బైసెక్సువ‌ల్, శాడిస్ట్, డ్ర‌గ్స్‌కు బానిస‌: న‌టుడు సామ్రాట్ భార్య‌

వేధింపుల కేసులో అరెస్ట‌యిన సినీ న‌టుడు సామ్రాట్ రెడ్డి అస‌లు స్వ‌రూపం ఇదీ అంటూ ఆయ‌న భార్య హ‌ర్షిత రెడ్డి ఆరోప‌ణ‌లు చేశారు. త‌న భ‌ర్త ఓ గే అని, బైసెక్సువ‌ల్ అని ఆరోపించారు.

సామ్రాట్‌కు ప‌లువురు మ‌గ‌వాళ్ల‌తో కూడా అత‌నికి శారీర‌క సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఇదే విష‌యాన్ని హ‌ర్షితారెడ్డి తండ్రి కృష్ణారెడ్డి కూడా ధృవీక‌రిస్తున్నారు.

త‌న ఎదురుగానే సామ్రాట్ చాలాసార్లు అబ్బాయిలతో సెక్సీ ఛాట్స్ చేస్తూ క‌నిపించాడ‌ని చెప్పారు. త‌న కుమార్తెను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి వరకట్నం కోసం వేధింపులకు గురి చేశాడని ఆరోపించారు.

సామ్రాట్‌కు వేరే యువతులతో కూడా సంబంధాలు ఉన్నాయ‌ని హ‌ర్షితారెడ్డి స్ప‌ష్టం చేశారు. డ్రగ్స్, హుక్కా సెంట‌ర్ల‌కు రోజూ వెళ్తాడ‌ని, డ్ర‌గ్స్ తీసుకుని ఇంటికొచ్చేవాడని హర్షిత తెలిపారు.

మ‌ద్యం, డ్ర‌గ్స్‌కు తాను డ‌బ్బులు ఇవ్వ‌క‌పోవ‌డం వ‌ల్ల ఇంట్లో బంగారం, విలువైన వస్తువులు ఎత్తుకెళ్లినట్లు హర్షితారెడ్డి పేర్కొంది.

పార్టీకి వెళ్లే సమయంలో సామ్రాట్ డ్రగ్స్ తీసుకునేవాడని చెప్పింది. ఈ కేసులో సామ్రాట్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here