ఆమరణ నిరాహారదీక్ష చేయనున్న శివాజీ..!

సినీ నటుడు శివాజీ మొదటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని కోరుతున్న వారిలో ఉన్నారు. ఎన్నో ప్రాంతాల్లో పర్యటించారు కూడానూ.. ఎన్నో లైవ్ డిబేట్లలో పాల్గొని.. మనకు స్పెషల్ స్టేటస్ ఎంత ముఖ్యమో చెప్పారు కూడా.. అయితే అప్పుడు దాని మీద ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. గత కొద్ది రోజులుగా మరోసారి ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ కావాలన్న నినాదం జోరందుకుంది.

ఈ తరుణంలో శివాజీ మరోసారి ప్రత్యేక హోదాపై తన పోరును మొదలుపెట్టనున్నాడు. కొంతకాలంగా విదేశాల్లో ఉన్న శివాజి.. ఈ మధ్యనే తిరిగి వచ్చి మీడియాతో మాట్లాడాడు. ఈసారి పార్లమెంటు సమావేశాల్లో ప్రత్యేక హోదాను ప్రకటించని పక్షంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఆయన వెల్లడించారు. ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తానని మోసం చేసిన మోడీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.

ప్రత్యేక హోదా సాధనకు అన్ని పార్టీలు నాటకాలు ఆపి పోరాటానికి కలిసిరావాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బీజేపీ వెంట్రుకతో సమానంగా పోల్చుతోందని గతంలో శివాజీ అన్నారు. ప్రత్యేక హోదా సాధనకు అన్ని పార్టీలు కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు. అందుకోసమే ఆమరణ నిరాహార దీక్ష చేయనున్నాడేమో..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here