ఆమె చేతిలో సిగ‌రెట్‌..అత‌ని చేతిలో లిప్‌స్టిక్‌!

హైద‌రాబాద్‌: క‌మేడియ‌న్ శ్రీ‌నివాస‌రెడ్డి హీరోగా న‌టిస్తోన్న కొత్త చిత్రం `జంబ‌ల‌కిడిపంబ‌`. జేబీ మురళీకృష్ణ (మను) దర్శకత్వం. సిద్ధి ఇద్నాని క‌థానాయిక‌గా న‌టిస్తోంది. శివమ్‌ సెల్యూలాయిడ్స్, మెయిన్‌లైన్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రవి, జోజో జోస్, శ్రీనివాసరెడ్డి.ఎన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇదొక రొమాంటిక్ కామెడీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌గా తెర‌కెక్కిస్తున్నారు. గోపి సుంద‌ర్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. హైద‌రాబాద్‌, ఈస్ట్ గోదావరి, అర‌కు, వైజాగ్‌, కేర‌ళ ప‌రిస‌ర ప్రాంతాల‌లో షూటింగ్ జ‌రుపుకున్న ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ తాజాగా విడుద‌ల చేశారు.

ఇందులో శ్రీనివాస రెడ్డి అమ్మాయిలా లిప్‌స్టిక్ పెట్టుకుంటుంటే, హీరోయిన్ సిద్ధి ఇద్నానీ మ‌గాడిలా ఫోజిచ్చింది. 1993లో వ‌చ్చిన జంబ‌ల‌కిడిపంబ ఏ స్థాయిలో న‌వ్వించిందో మ‌న‌కు తెలుసు. ఇప్ప‌టికీ ఆ సినిమా ఎప్పుడు టీవీల్లో వ‌చ్చినా టీఆర్‌పీ పెరుగుతుంటుంది.

న‌రేష్‌, ఆమ‌నిల‌తో పాటు అప్ప‌టి క‌మేడియ‌న్లంద‌రూ ఈ సినిమాలో క‌నిపిస్తారు. గ్రూప్ కామెడీని పండిస్తారు. అదే పేరుతో వ‌స్తోన్న లేటెస్ట్ జంబ‌ల‌కిడిపంబ ఎలా ఉంటుందో గానీ.. ఆ పేరును చెడ‌గొట్ట‌కుండా ఉంటే చాలనుకుంటున్నారు అభిమానులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here