మ‌హేష్‌..కాల‌ర్ ఎగ‌రేసేలా చేశావ్‌:

హైద‌రాబాద్‌: సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు న‌టించిన `భ‌ర‌త్ అనే నేను..` సినిమా సృష్టిస్తోన్న క‌లెక్ష‌న్ల ప్ర‌భంజ‌నానికి టాలీవుడ్ ఆశ్చ‌ర్య‌పోతోంది. 48 గంట‌ల్లో 100 కోట్ల రూపాయ‌ల‌ను క‌లెక్ట్ చేసిన ఈ మూవీ.. 175 కోట్ల రూపాయ‌ల మైలురాయిని అందుకుంది. సినిమా విడుద‌లైన ఆరో రోజు కూడా క‌లెక్ష‌న్ల తుఫాన్‌ను కురిపిస్తోంది.

మ‌హేష్ న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ఒక్క ప్రేక్ష‌కులే తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ కూడా మ‌హేష్‌ను ఆకాశానికెత్తేస్తోంది. మ‌హేష్ న‌ట‌న మైండ్ బ్లాక్ చేస్తోంది. తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌, హీరోలు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల‌తో పాటు తాజాగా.. విక్ట‌రీ వెంక‌టేష్ కూడా మ‌హేష్ న‌ట‌నను ప్ర‌శంసించ‌కుండా ఉండ‌లేక‌పోయారు.

‘భరత్‌ అనే నేను చూశాను. మహేశ్‌బాబు అత్యుత్తమ న‌ట‌న‌ను ప్రదర్శించారు. శివ కొరటాల సున్నితమైన కథని అందరూ మెచ్చేలా రూపొందించారు. నిర్మాత దానయ్యతో పాటు చిత్ర బృందం మొత్తానికి అభినందనలు’ అంటూ ట్వీట్ చేశారు. మ‌హేష్‌బాబు ఫొటోను దానికి యాడ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here