పోలీసుల ముందు లొంగిపోయిన అమలా పాల్.. తప్పు చేశానని ఒప్పుకుంది..!

కష్టపడి డబ్బులు సంపాదించడం.. ఎక్కడో ఒక చోట చిన్న తప్పు చేయడం.. అది వివాదం అవ్వడం.. ఇదీ ప్రస్తుతం సినీ పరిశ్రమలో వార్తల్లో నిలుస్తున్న అంశాలు. పెళ్ళి విషయం పక్కన పెడితే.. నటిగా అమలా పాల్ కు మంచి పేరు ఉంది. పలు భాషల్లో నటిస్తూ బాగానే డబ్బులు వెనకేసుకుంటూ వస్తోంది. అయితే కారు విషయంలో ఆమె చేసిన చిన్న తప్పు పోలీసుల ముందు లొంగిపోయేలా చేసింది.

మెర్సిడీస్ బెంజ్ ఎస్-క్లాస్ కారు కొన్న అమలా పాల్ రూ.20 లక్షల రూపాయల దాకా పన్ను ఎగ్గొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కుంటోంది. ఆమె పుదుచ్చేరి రిజిస్ట్రేషన్ పెట్టి కారు కొంది. దీంతో ఆమెపై కేరళలో ఐపీసీ సెక్షన్ 420, 468, 471 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె తిరువనంతపురంలోని క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయారు. ఆమె బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోగా, తిరస్కరించిన కోర్టు, క్రైమ్‌ బ్రాంచ్‌ ఎదుట హాజరుకావాలని ఆదేశాలు జారీ చేయడంతో ఆమె లొంగిపోయింది. తప్పు చేశానని పోలీసుల ఎదుట అంగీకరించి అక్కడి నుండి వెళ్లిపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here