పాపం.. నటి అపూర్వ భూమిని కూడా కబ్జా చేసేశారు..!

సినీ నటి అపూర్వ.. ఇటీవలే ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి నోరు విప్పారు. ఆ తర్వాత ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు ఆమె వేరే విషయంలో వార్తల్లో నిలిచారు. పాపం అపూర్వ భూమిని కబ్జా రాయుళ్ళు కాజేశారట. కొద్ది రోజుల వ్యవధి లోనే తమ భూమిని కాజేశారని ఆమె చెప్పుకొచ్చింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు.

తన వ్యవసాయ భూమిని కబ్జా చేశారంటూ పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దెందులూరులో తనకు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉందని తెలిపారు. ఇటీవలే తమ భూమిని సర్వేయర్ తో సర్వే చేయించి సరిహద్దుల్లో రాళ్లు పాతించామని చెప్పారు. మరుసటి రోజే చుట్టు పక్కల ఉన్న రైతులు ఆ రాళ్లను తొలగించి, భూమిని ఆక్రమించారని తెలిపారు. ఈ కబ్జా వ్యవహారంపై పోలీసులు మాట్లాడుతూ, ఇది సివిల్ వ్యవహారమని రెవెన్యూ అధికారులతో మాట్లాడి, సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here