ఠ‌క్కున చెప్పండి..ఎవ‌రీ టాలీవుడ్ హీరోయిన్‌?

బ‌బుల్‌గ‌మ్ పింక్ క‌ల‌ర్ జుట్టుతో మెరిసిపోతున్న ఈ అమ్మ‌డు నాలుగైదు తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించింది. ఈ నాలుగైదింట్లో రెండు సినిమాలు సూప‌ర్‌హిట్. అవే నితిన్ `హార్ట్ ఎటాక్‌`, అడివి శేష్ `క్ష‌ణం`.

క్ష‌ణం సినిమాలో ఆమె ఇర‌గ‌దీసింది. థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో తెర‌కెక్కిన ఈ సినిమాతో ఆమెకు మంచి పేరే వ‌చ్చిన‌ప్ప‌టికీ.. సినిమాలు చేతికి రాలేదు. ఆమే అదా శ‌ర్మ‌.

బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌.. ఇలా అన్ని భాష‌ల్లోనూ న‌టిస్తున్న‌ప్ప‌టికీ.. స‌రైన బ్రేక్ ద‌క్క‌లేదామెకు. తాజాగా- ముంబైలో జ‌రిగిన ఫెమినా బ్యూటీ అవార్డ్స్‌-2018 కార్య‌క్ర‌మానికి అదా శ‌ర్మ ఇదిగో.. ఇలా హాజ‌రైంది.

బ‌బుల్‌గ‌మ్ పింక్ క‌ల‌ర్ జుట్టేసుకుని అంద‌ర్నీ ఆక‌ట్టుకుంది. ఈ గెట‌ప్‌లో ఆమెను ఠ‌క్కున గుర్తు ప‌ట్ట‌డం కాస్త క‌ష్ట‌మే. ప్ర‌స్తుతం ఆమె రెండు బాలీవుడ్ సినిమాల‌తో పాటు ఓ త‌మిళ్ మూవీలో న‌టిస్తోంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here