ముఖానికి ప్లాస్టిక్ క‌వ‌ర్‌ను క‌ప్పుకొన్న ఈ ప్ర‌భాస్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

ముఖానికి ప్లాస్టిక్ క‌వ‌ర్‌ను క‌ప్పుకొన్న ఈ న‌టి బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌. తెలుగులో ప్ర‌భాస్ స‌ర‌స‌న `ఏక్ నిరంజ‌న్‌` సినిమాలో న‌టించింది. ప్రస్తుతం క్రిష్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తోన్న `మ‌ణిక‌ర్ణిక‌`లో న‌టిస్తోంది. ఈ మూవీ ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత చ‌రిత్ర ఆధారంగా ఈ మూవీ బాలీవుడ్‌లో తెర‌కెక్కుతోంది. ఆమే కంగ‌నా ర‌నౌత్‌.

 

ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా ముఖానికి ప్లాస్టిక్ క‌వ‌ర్‌ను క‌ప్పుకొంది. దీనికి కార‌ణం- ప్లాస్టిక్, ప్లాస్టిక్ క‌వ‌ర్ల వ‌ల్ల క‌లిగే ప్ర‌మాదం గురించి తెలియ‌జేయ‌డానికి. ముఖానికి ప్లాస్టిక్ క‌వ‌ర్‌ను క‌ప్పుకొని కొన్ని సెకెన్ల పాటు కూడా ఆమె ఉండ‌లేక‌పోయారు గాలి ఆడ‌క‌. అలాంటిది స‌ముద్రాన్ని ఈ ప్లాస్టిక్ క‌వ‌ర్లు మింగేస్తున్నాయ‌ని, వాటి బారి నుంచి జ‌ల‌చ‌రాల‌ను కాపాడుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్పారు.

`వ‌చ్చే మ‌రో 30 సంవ‌త్స‌రాల్లో స‌ముద్రాల్లో చేప‌లు, ఇత‌ర జ‌ల‌చ‌రాల కంటే ప్లాస్టిక్ ఎక్కువ‌గా క‌నిపిస్తుంది. ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉండాల‌ని కోరుకుంటున్నా..` అని ఆమె సందేశాన్ని ఇచ్చారు. కంగ‌నా చెప్పన‌ది అక్ష‌రాలా నిజం వ‌చ్చే 30 సంవ‌త్స‌రాల్లో స‌ముద్రాలు ప్లాస్టిక్ మ‌యం అవుతాయ‌ని ఇప్ప‌టికే పర్యావ‌ర‌ణ వేత్త‌లు ఆందోళ‌న వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here