రమణానంద మహర్షి మానసికంగా హింసిస్తున్నారన్న కల్యాణి.. పోలీసులకు ఫిర్యాదు..!

అబ్బ.. పిండేశారు.. అంటూ మిరపకాయ్ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కల్యాణిని రవితేజ టీజ్ చేయడం అందరికీ బాగా నచ్చింది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కల్యాణికి మంచి మంచి అవకాశాలు వచ్చాయి. తాజాగా ఆమె పోలీసులను ఆశ్రయించింది.

రమణానంద మహర్షి, ఆయన నిర్వహణలో నడుస్తున్న శివశక్తి సాయి టీవీ చానల్ తనపై అవాస్తవ కథనాలను ప్రసారం చేసి దుష్ప్రచారం చేస్తోందని ఆమె ఫిర్యాదు చేసింది. తనను కించపరిచేలా కథనాలు ప్రసారం చేస్తూ.. తనను మానసికంగా హింసిస్తున్నారని ఆమె పేర్కొంది. రమణానందను విమర్శించాననే కోపంతో, కక్షపూరితంగా చానల్‌ను అడ్డం పెట్టుకుని తనను మానసికంగా హింసిస్తున్నారని ఫిర్యాదు చేసింది.

తన వృత్తిని, వ్యక్తిత్వాన్ని, సినిమాల్లో తాను చేస్తున్న పాత్రలను పేర్కొంటూ కించపరిచే విధంగా వార్తలు ప్రసారం చేశారని తెలిపారు. హరికథలు చెబుతూ పెరిగానని, రామాయణాన్ని కించపరిచే విధంగా మాట్లాడినందుకు రమణానందను విమర్శించానే తప్ప తన తప్పేది లేదని ఆమె చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here