న‌య‌న‌తార అభిమాన హీరో ఎవ‌రో తెలుసా? బాల‌కృష్ణ అనుకునేరు!

తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఓ వెలుగు వెలుగుతోంది న‌య‌న‌తార‌. ప్ర‌త్యేకించి- త‌మిళంలో లేడీ సూప‌ర్‌స్టార్‌గా పేరు తెచ్చుకుంది. స్టార్ హీరోతో స‌మానంగా రెమ్యున‌రేష‌న్ తీసుకుంటోంది.

ఇటీవ‌లి కాలంలో ఆమె న‌టించిన సినిమాల‌న్నీ సూప‌ర్‌హిట్లే. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీల్లోనూ ఆమెకు తిరుగులేదు. తెలుగులోనూ ఆమె టాప్‌ప్లేస్‌లో ఉన్నారు.

తాజాగా న‌య‌న‌త‌రా న‌టించిన `జైసింహ‌` మొద‌ట ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న‌ప్ప‌టికీ..సంక్రాంతికి మంచి సినిమాలేవీ విడుద‌ల కాక‌పోవ‌డంతో సేఫ్ ప్రాజెక్ట్ అనిపించుకుంది. మంచి క‌లెక్ష‌న్ల‌ను రాబట్టుకుంటోంది.

అలాంటి న‌య‌న‌తార అభిమాన హీరో ఎవ‌రో తెలుసా? అజిత్‌. `త‌లై`గా అభిమానుల‌తో పిలిపించుకుంటోన్న త‌మిళ్ హీరో అజిత్ అంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని చెబుతోంది న‌య‌న‌తార‌.

ఇదివ‌ర‌కే ఆమె అజిత్‌తో మూడు సినిమాలు చేసింది. 2007లో బిల్లా కోసం మొద‌టిసారిగా అజిత్ స‌ర‌స‌న న‌టించింది. ఆ మ‌రుస‌టి ఏడాది ఏగ‌న్‌, 2013లో ఆరంభం సినిమాల‌ను చేసింది.

ఇద్ద‌రిదీ హిట్ కాంబినేష‌న్‌గా భావిస్తారు త‌మిళ సినిమా పెద్ద‌లు. షారుక్‌ఖాన్ మై హూన సినిమాకు రీమేక్‌గా రూపొందింది ఏగ‌న్‌. అది హిట్‌.

అంత‌కుముందు వారిద్ద‌రూ న‌టించిన బిల్లా ఎంత పెద్ద హిట్టో మ‌న‌కు తెలిసిందే. ఆరంభం కూడా అంతే. అజిత్ న‌ట‌న పేల‌డానికి సిద్ధంగా ఉన్న అగ్నిప‌ర్వ‌తంలా ఉంటుంద‌ని కితాబిచ్చిందామె.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here