స్టార్ హీరోయిన్‌కు క్యాబ్‌లో చేదు అనుభ‌వం!

స్టార్ హీరోయిన్‌కు క్యాబ్‌లో చేదు అనుభ‌వం ఎందురైంది. పెళ్లి జంట‌కు కానుక‌గా ఇవ్వ‌డానికి ఆమె కొనుగోలు చేసిన ఖ‌రీదైన వాచీ సెట్ల‌ను క్యాబ్ డ్రైవ‌ర్ ఒక‌రు కొట్టేశారు. ఆ న‌టి పేరు ప‌రుల్ యాద‌వ్‌. త‌మిళ‌, క‌న్న‌డ సినిమాల్లో టాప్ రేంజ్‌లో ఉందా న‌టి. త‌న స‌మీన బంధువు వివాహానికి హాజ‌రు కావ‌డానికి ఆమె ఓలా క్యాబ్‌ను బుక్ చేసుకున్నారు. బెంగ‌ళూరులోని లావెల్లె రోడ్ నుంచి కెంపెగౌడ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి బ‌య‌లుదేరారు.

 

వాచీ సెట్‌, హ్యాండ్‌బ్యాగ్‌ను కారులో పెట్టి మార్గ‌మ‌ధ్య‌లో కారు దిగారు. కొద్దిసేప‌టి త‌రువాత కారు ఎక్కి చూడ‌గా.. అందులో ఆమె హ్యాండ్‌బ్యాగ్‌, వాచీ సెట్ క‌నిపించ‌లేదు. క్యాబ్ డ్రైవ‌ర్‌ను ప్ర‌శ్నించ‌గా- త‌న‌కు తెలియ‌ద‌ని స‌మాధానం ఇచ్చి, వెళ్లిపోయాడు. దీనితో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. మూడు గంట‌ల వ్య‌వ‌ధిలో క్యాబ్ డ్రైవ‌ర్‌ను ప‌ట్టుకుని, వాచీ సెట్‌ను స్వాధీనం చేసుకుని పరుల్‌కు అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here