రెజీనా..సొంతంగా డ‌బ్బింగ్‌!

చెన్నై: ప‌్ర‌ముఖ న‌టి రెజీనా సొంతంగా డ‌బ్బింగ్ చెప్పుకొంది. అదీ త‌మిళంలో. ఆమె న‌టిస్తోన్న తాజా త‌మిళ చిత్రం `మిస్ట‌ర్ చంద్ర‌మౌళి`. కార్తీక్ త‌న‌యుడు గౌత‌మ్ కార్తీక్ ఇందులో హీరో. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా సాగుతోంది. ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తోన్న రెజీనా.. త‌న పాత్ర‌కు తానే డ‌బ్బింగ్ చెప్పుకొంది. ఏ భాష‌లోనైనా త‌న పాత్ర‌కు తానే డ‌బ్బింగ్ చెప్పుకోవ‌డం ఇదే తొలిసారి. మిస్ట‌ర్ చంద్ర‌మౌళిలో హాట్ హాట్ స‌న్నివేశాల్లో క‌నువిందు చేసింద‌నేది టీ న‌గర్ టాక్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here