చిరంజీవి, జూ.ఎన్టీఆర్‌ల‌తో పోటీ ప‌డ్డ ఈ డాన్సింగ్ బ్యూటీ ఎవ‌రో చెప్ప‌గ‌ల‌రా?

ఈ ఫొటోలో క‌నిపిస్తోన్న న‌టి కొన్ని తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించారు. మెగాస్టార్ చిరంజీవి, జూనియ‌ర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో తెర‌ను పంచుకున్నారు. వారితో పోటీ ప‌డి మ‌రీ డాన్స్ చేశారు. ఆమే స‌మీరా రెడ్డి. జై చిరంజీవ, న‌ర‌సింహుడు, అశోక్ వంటి సినిమాల్లో న‌టించారు. త‌మిళంలోనూ త‌న స‌త్తా చాటుకున్నారు.

ద‌క్షిణాది సినిమాల‌కు మించి బాలీవుడ్‌లో ప‌లు చిత్రాల్లో న‌టించారు. 2014లో అక్ష‌య్ వ‌ర్దె అనే వ్యాపార‌వేత్త‌ను పెళ్లి చేసుకుని, సినిమాల‌కు గుడ్‌బై చెప్పారు. ఇప్పుడామెకు ఓ కుమారుడు. పెళ్లయిన త‌రువాత‌.. ఎక్క‌డా క‌నిపించ‌లేదు. సినీ ఫంక్ష‌న్ల‌కూ హాజ‌రు కావ‌ట్లేదు. ఈ అయిదేళ్ల‌లో ఆమె పూర్తిగా మారిపోయారు. ఇప్పుడామెను ఠ‌క్కున గుర్తు ప‌ట్ట‌డం కాస్త క‌ష్ట‌మే.

https://www.instagram.com/p/BjEgNJ9lyHo/?taken-by=reddysameera

https://www.instagram.com/p/BiyolxEH3bQ/?taken-by=reddysameera

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here