ష‌కీలా మ‌ళ్లీ వ‌స్తోంది..ఈ సారి `శీల‌వ‌తి`గా!

మ‌ల‌యాళీ సెక్స్‌బాంబ్ ష‌కీలా మ‌రోసారి తెలుగు తెర‌పై క‌నువిందు చేయ‌బోతున్నారు. ఈ సారి ఆమె ఓ డైరెక్ట్ తెలుగు మూవీలో న‌టిస్తున్నారు. గుట్టు చ‌ప్పుడు కాకుండా ఆ మూవీ తెర‌కెక్కుతోంది.

దాని పేరు `శీల‌వ‌తి..`. ఈ సినిమాకు సంబంధించిన ఫ‌స్ట్‌లుక్‌ను ఆదివారం విడుద‌ల చేసింది చిత్రం యూనిట్‌. ఇంకో విశేష‌మేమిటంటే.. ఇది ష‌కీలా న‌టిస్తోన్న 250వ చిత్రం. ప్ర‌తిష్ఠాత్మ‌క జీ స్టూడియోస్‌ పతాకంపై ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.

అల్కహాల్ నింపిన గ్లాస్‌ను ఎదురుగా ఉంచుకుని, సిగ‌రెట్ తాగుతూ క‌నిపిస్తోన్న స్టిల్ ఇది. సాయిరాం దాసరి దర్శకత్వం వ‌హిస్తున్నారు.

రాఘవ ఎమ్‌. గణేష్‌, వీరు బాసింశెట్టిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదో సైకలాజికల్‌ థ్రిల్లర్ అట‌. కేరళలో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా తెర‌కెక్కించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here