ఫిల్మ్‌మేక‌ర్‌తో శ్వేతాబ‌సు ప్ర‌సాద్ ఎంగేజ్‌మెంట్

శ్వేతాబ‌సు ప్ర‌సాద్‌. టాలీవుడ్‌కు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు ఇది. ఆమె న‌టించిన తొలి సినిమానే ఓ సంచ‌ల‌నం. `కొత్త‌బంగారు లోకం` మూవీలో కొత్త కొత్త‌గా క‌న‌పించిన శ్వేతబ‌సు ప్ర‌సాద్ వెంట ప‌డింది యువ‌త‌రం. తొలి సినిమాతోనే టాప్ బ్యాన‌ర్‌లో న‌టించిందామె.

తెలుగు తెర‌కు స‌రికొత్త, సంచ‌ల‌న న‌టి దొరికింద‌నే అనుకుంటున్న స‌మ‌యంలోనే ఆమె కేరీర్.. పాతాళానికి జారిపోయింది. మ‌ద్యానికి బానిస కావ‌డం ఒక ఎత్తు కాగా, వ్య‌భిచారం కేసులో దొర‌క‌డం మ‌రో ఎత్తు. ఈ కేసు ఆమెను త‌లెత్తుకోనివ్వ‌లేదు. కొన్నిరోజుల పాటు జైలుపాలు కూడా కావాల్సి వ‌చ్చింది.

జైలు నుంచి విడుద‌లైన త‌రువాత టాలీవుడ్ ముఖం చూడ‌లేదామె. ఎక్క‌డైతే బంగారంలాంటి అవ‌కాశాల‌ను ఇచ్చిందో అక్క‌డే ఛీత్కారాల‌ను ఎదుర్కోవాల్సి రావ‌డంతో ఆమె త‌న స్వ‌రాష్ట్రానికి వెళ్లిపోయింది. ప్ర‌స్తుతం ఆమె జీవితం కుదురుకుంది. ఫిల్మ్‌మేక‌ర్ రోహిత్ మిట్ట‌ల్‌తో ప్రేమ‌లో ప‌డింది. ఆ ప్రేమ‌ను పెళ్లిపీట‌ల దాకా తీసుకొచ్చింది. రోహిత్ మిట్ట‌ల్‌తో ఎంగేజ్‌మెంట్ అయింది.

గోవాలో అతి కొద్దిమంది స‌న్నిహితుల స‌మ‌క్షంలో ఎంగేజ్‌మెంట్ పూర్త‌యిన‌ట్టు శ్వేతాబ‌సు వెల్ల‌డించింది. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ ఈ ఎంగేజ్‌మెంట్ హాజ‌రైన‌ట్టు వెల్ల‌డించింది. రోహిత్ ఆమెను గోవాలోనే ప్ర‌పోజ్ చేశాడ‌ట‌. అందుకే- అక్క‌డే ఎంగేజ్‌మెంట్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించిన‌ట్లు చెబుతున్నారు. మ‌హారాష్ట్రలోని పుణేకు చెందిన రోహిత్ మిట్ట‌ల్ యాడ్ ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్ మేక‌ర్‌. ఈ ఫీల్డ్‌లో అత‌నికి మంచి నైపుణ్యం ఉంది.

Through the walled city

A post shared by Shweta Basu Prasad (@shwetabasuprasad11) on

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here