కలిసే అవకాశం ఇవ్వండి రామోజీరావు గారు.. ఈటీవీ పేరుతో అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారు..!

లీకుల మీద లీకులు చేస్తున్న శ్రీ రెడ్డి ఈరోజు ఈటీవీ పేరు చెప్పుకొని జరుగుతున్న మోసాలపై స్పందించింది. రామోజీరావు గారిని తాను కలవాలని కోరుకుంటున్నానని.. అక్కడ ఉన్న ఓ బ్యాచ్ గురించి తాను ఫిర్యాదు చేయాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చింది శ్రీ రెడ్డి.

‘రామోజీ రావు గారు.. మీరు ఈటీవీకి నైతిక విలువలు, క్రమశిక్షణ బాగా మెయింటైన్ చేస్తారు. సర్ మిమ్మల్ని కలిసే అవకాశం నాకు ఇవ్వండి. మీ ఈటీవీ పేరు చెప్పుకుని అమ్మాయిల జీవితాలతో ఆడుకునే పురుగుల్ని మీ కాంపౌండ్ లో లేకుండా చేద్దురుగాని.. మీ లాంటి పెద్దవారిని ఎలా చేరుకోవాలో తెలియదు… ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఈటీవీ కోసం కార్యక్రమాలను రూపొందిస్తూన్న అనిల్ అనే వ్యక్తికి అమ్మాయిలంటే ఏ మాత్రం రెస్పెక్ట్ లేదు. తనకున్న పవర్ తో వెబ్ ఛానల్ లో వచ్చిన వీడియోస్ ని బలవంతంగా తెప్పిస్తున్నాడు’ అని ఫిర్యాదు చేసింది.

శ్రీరెడ్డి.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల మీద కూడా కామెంట్లు చేసింది. “పెద్ద డైరెక్టర్ అని పోజు. అబద్ధాలు చెప్పడంలో దిట్ట. తెలుగు అమ్మాయిలంటే పక్కలోకి తప్ప ఎందుకూ పనికిరారని ప్రగాఢ విశ్వాసం. ప్రామిస్ లను బ్రేక్ చేయడంలో వీరి తర్వాతే ఎవరైనా. బక్కపీచు సోగ్గాడు. ఊదితే ఎగిరిపోయే ఇతనికి భయం, బలం రెండూ ఎక్కువే. టెక్నికల్ గా దొరక్కుండా టెక్నాలజీని బాగా వాడాడు. మా ఇంటి కింద గూర్ఖాలా తిరిగేవాడు. వీడియో కాల్ కోసం ఏమైనా కోసేసుకుంటాడు పాపం. మగ ఆర్టిస్టుల దగ్గర డబ్బులు గుంజుతాడని టాక్. వీరెవరో కాదు కొమ్ములు వచ్చిన శేఖర్” అంటూ శేఖర్ కమ్ములపై శ్రీరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

Ramoji rao garu,etv ki ethics nd discipline baga maintain chestaru..Sir naku kalise avakasam ivvandi..Me e tv Peru…

Sri Reddyさんの投稿 2018年4月2日(月)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here