శ్రీ‌రెడ్డి..వారికి అండ‌గా!

టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌పై పోరాడిన వ‌ర్ధ‌మాన న‌టి శ్రీ‌రెడ్డి తాజాగా మ‌రోసారి వార్త‌ల్లోకి ఎక్కారు. ఈ సారి కూడా ఆమె పోరాట‌పంథాను ఎంచుకున్నారు. చిత్ర‌పురి పోరాట స‌మితి ప్ర‌తినిధులు చేప‌ట్టిన నిర‌వ‌ధిక నిరాహార దీక్ష‌కు శ్రీ‌రెడ్డి మ‌ద్ద‌తు ప‌లికారు. ఫిల్మ్‌న‌గ‌ర్‌లో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరానికి ఆమె సోమ‌వారం హాజ‌ర‌య్యారు. తానూ దీక్ష‌కు కూర్చున్నారు.

 

చిత్ర‌పురి పేరుతో తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌కు జూనియ‌ర్ ఆర్టిస్టులు, కార్మికుల కోసం ఇళ్లను నిర్మించ‌డానికి చాలాకాలం కింద‌టే ప్ర‌భుత్వం స్థ‌లాన్ని కేటాయించింది. అయిన‌ప్ప‌టికీ.. అందులో ఎలాంటి నిర్మాణాలూ ఇంకా చేప‌ట్ట‌లేదు. ఇళ్ల‌ను నిర్మించాలంటూ జూనియ‌ర్ ఆర్టిస్టులు, కార్మికులు చాలాకాలం నుంచి పోరాడుతున్నారు.

అయిన‌ప్ప‌టికీ.. ఎలాంటి స్పంద‌న రాలేదు. దీనితో వారు చిత్ర‌పురి పోరాట స‌మితి పేరుతో ఆందోళ‌న చేప‌ట్టారు. ఇందులో భాగంగా- ఫిల్మ్‌న‌గ‌ర్‌లోని ఫిల్మ్‌ఛాంబ‌ర్ ఎదుట నిరాహార దీక్ష చేపట్టారు. వారి ఆందోళ‌న‌కు శ్రీ‌రెడ్డి మ‌ద్ద‌తు ఇచ్చారు. తానూ దీక్ష‌కు కూర్చున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here