`ఇంట్లో ఒంట‌రిగా ఉంటున్నాన‌నుకుంటున్నారా?`- శ్రీ‌రెడ్డి

టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్ విష‌యంతో ఒక్క‌సారిగా వెలుగులోకి వ‌చ్చారు శ్రీ‌రెడ్డి. ఓ రకంగా ఆమె స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. కాస్టింగ్ కౌచ్ ఉదంతంలో ఏకంగా ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ పేరు లాగ‌డంతో జ‌నం దృష్టిని ఆమె ఇట్టే ఆక‌ట్టుకోగలిగారు. ఓ పాతిక సినిమాల్లో న‌టించినా కూడా రాని గుర్తింపును శ్రీ‌రెడ్డి ఒకే ఒక్క సామాజిక అంశంతో సాధించారు.

అప్ప‌టి నుంచీ ఆమె త‌ర‌చూ వార్త‌ల్లో వ్య‌క్తిగా ఉంటూ వ‌స్తున్నారు. ప‌లువురు సినీ ప్ర‌ముఖుల‌ను టార్గెట్‌గా చేసుకుని, వారి గుట్టును ర‌ట్టు చేస్తున్నారు. తాజాగా- ఆమె సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ట్వీట్ జ‌నాన్ని ఆక‌ర్షించింది. తాను ఇంట్లో ఒంట‌రిగా ఉంటున్నాన‌ని అనుకోవ‌ద్దంటూ ట్వీట్ చేశారు.

త‌న ఇల్లు ఎప్పుడూ పిల్లా, పాప‌ల‌తో ఉంటుంద‌ని చెప్పారు. దీనికి సంబంధించిన ఓ సెల్ఫీ, ఓ పిక్‌ను ఆమె షేర్ చేశారు. ఆ పిల్లా పాప‌లంటే మ‌రెవ‌రో కాదు. పావురం, ఆ ప‌క్షి పిల్ల‌లు. తాను ఇంట్లో ఒంట‌రిగా ఉండ‌న‌ని, పావురం, దాని పిల్ల‌ల‌తో క‌లిసి నివ‌సిస్తున్నాన‌ని ట్వీట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here