శ్రీ‌రెడ్డి కొత్త అవ‌తారం! శ్రీ‌శైలం వెళ్తూ, దారి మ‌ధ్య‌లో!

టాలీవుడ్‌లో కాస్టింగ్ కౌచ్‌పై పోరాడుతోన్న వ‌ర్ధ‌మాన న‌టి శ్రీ‌రెడ్డి.. ఇలా స‌రికొత్త అవ‌తారంలో క‌నిపించారు. మ‌ల్లికార్జున‌డి ద‌ర్శ‌నం కోసం శ్రీ‌శైలం వెళ్తూ, దారి మ‌ధ్య‌లో క‌నిపించిన మ‌హిళా కార్మికుల‌తో క‌లిసిపోయారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కం కింద ప‌నిచేస్తోన్న మ‌హిళా కార్మికులు వారు.

 

త‌మ డిమాండ్ల‌ను సాధించుకోవ‌డానికి ప్ర‌కాశం జిల్లా య‌ర్ర‌గొండ‌పాలెం మండ‌లం గురిజేప‌ల్లి వ‌ద్ద రోడ్డుపై ధ‌ర్నా చేస్తున్నారు. వారిని చూసిన శ్రీ‌రెడ్డి కారు దిగి వెళ్లారు. వారితో చాలాసేపు మాట్లాడారు. వారి డిమాండ్ న్యాయ‌మైన‌దేన‌ని, వాటిని వెంట‌నే నెర‌వేర్చాల‌ని కోరుతూ ఆమె కూడా ధ‌ర్నాలో బైఠాయించారు. సుమారు గంట పాటు శ్రీ‌రెడ్డి వారికి మ‌ద్ద‌తుగా నినాదాలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here