న‌న్ను రేప్ చేశాడు: పోలీసుల‌కు బాలీవుడ్ దిగ్గ‌జ న‌టి జీన‌త్ ఆమ‌న్ ఫిర్యాదు

ముంబై: బాలీవుడ్ సీనియ‌ర్ న‌టి జీన‌త్ ఆమ‌న్ లైంగిక వేధింపుల‌కు గుర‌య్యారు. 68 సంవ‌త్స‌రాల వ‌య‌స్సున్న జీన‌త్ ఆమ‌న్‌ను ఓ వ్యాపార‌వేత్త లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడు. ఈ మేర‌కు ముంబై జుహూ పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది. జీన‌త్ ఆమ‌న్ స్వ‌యంగా పోలీస్‌స్టేష‌న్‌కు వ‌చ్చి ఆ వ్యాపార‌వేత్త‌పై ఫిర్యాదు చేశారు.

నిందితుడిపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేసిన జుహూ పోలీసులు అత‌ణ్ని అరెస్టు చేశారు. అనంత‌రం ఈ కేసును ముంబై క్రైమ్ బ్రాంచ్‌కు బ‌దలాయించారు. ప్ర‌స్తుతం అత‌ను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల అదుపులో ఉన్న‌ట్టు తెలుస్తోంది.

అత్యాచార ఆరోప‌ణ‌ల‌ను ఎదుర్కొంటున్న స‌ద‌రు వ్యాపార‌వేత్త‌తో జీన‌త్‌కు ఇదివ‌ర‌కే ప‌రిచ‌యం ఉంది. జ‌న‌వ‌రి 30వ తేదీన అత‌ను త‌న‌ను లైంగిక వేధింపుల‌కు గురి చేశాడ‌ని, ఆ త‌రువాత త‌ర‌చూ త‌న‌ను ఫోన్ చేస్తూ, అనుస‌రిస్తూ వేధింపుల‌కు గురి చేస్తున్నాడ‌ని జీన‌త్ ఆమ‌న్ త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here